అర్ధాకలితో అలమటిస్తున్న కార్మికులను ఆదుకోవాలి : చేజర్ల

*కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ*
👉కార్మిక దినోత్సవ సందర్భంగా ఆయన అర్ధాకలితో అలమటిస్తున్న కార్మికులను ఆదుకోవాలి*
*👉40 రోజుల లాక్ డౌన్ వలన రోజువారీ కూలీలు,చిరువ్యాపారులు,చేతివృత్తుల వారు,ఆటో కార్మికులు లాంటి వారు పనులు లేక పస్థులు ఉంటున్నారు*
*ప్రభుత్వం వీరిని ఆదుకోకపోతే ఆకలి చావులు తప్పవు*
*👉ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగుల ఖర్చు,సలహాదారులు జీత, భత్యాల ఖర్చు,జాతీయ మీడియాలో ఇచ్చిన ప్రకటనల ఖర్చుతో ప్రతి కుటుంబానికి రూ 2 వేలు ఇచ్చి ఉండవచ్చు*
*👉సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత వచ్చింది, ఎందుకు ఖర్చు చేసారో చెప్పాలి*.    -  *చేజర్ల*


*గత 40 రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున రోజువారి కూలీల,చిరువ్యాపారులు, చేతివృత్తుల వారు,ఆటో కార్మికులు, డ్రైవర్లు తదితరులు పనులు లేక పస్థులు ఉంటున్నారని అటువంటి వారిని మే డే సందర్భంగా అయినా ప్రభుత్వం ఆదుకోవాలని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ వలన పనులు లేక పస్థులు ఉంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి సహాయం చేయలేదని,కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి చేతులు దులుపుకున్నదని,ఇటువంటి వారికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు   రూ2 వేల నుండిరూ 5 వేళా వరకు ఆర్ధిక సహాయం చేశాయని,మన రాష్ట్రంలో కూడా రూ 5 వేలు ఆర్ధిక సహాయం చేయమని తెలుగుదేశం పార్టీ తొలినుంచి కోరుతున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,రాష్ట్రములో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగుల ఖర్చు, సలహాదారులు కు ఇస్తున్న జీత,భత్యాల ఖర్చు,విద్య దీవెన పేరుతో జాతీయ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల ఖర్చు,కరోనా పై అవగహనా పేరుతో సాక్షి పత్రికలో ఇచ్చిన ప్రకటనల ఖర్చుతో రాష్ట్రములో రేషన్ కార్డు ఉన్న కోటి ఇరవై లక్షల కుటుంబాలకు రూ 2 వేలు ఆర్ధిక సహాయం చేసిఉండవచ్చునని,అదేవిధంగా కరోనా ఇప్పిటికిప్పుడు తగ్గే సూచనలు కనపడటం లేదని,మరి కొన్ని రోజులు లోక్ డౌన్ కొనసాగితే ఆకలి చావులు కూడా చూడవలసి ఉంటుందని అందువలన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఆదుకునే మార్గాలు అన్వేసించి వీరి భవిష్యత్తు పై భరోసా కల్పించాలని,రాష్ట్ర మంతా కరోనా గురించి ఆలోచిస్తుంటే,వైసీపీ నాయకులు మాత్రం ఈ సమయంలో అక్రమ సంపాదన చేస్తున్నారని,నాటు సారా,అక్రమ మద్యం,ఇసుకు,గ్రావెల్ వ్యాపారాలు చేస్తున్నారని,ఈరాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతుందని స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారే చెప్పారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతుందని,రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ఎంత విరాళాలు వచ్చాయో వాటిని ఎందుకు ఖర్చు చేసారో చెప్పాలని అన్నారు.*