ముమ్మరంగా నీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులు

ముమ్మరంగా నీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులు


వింజమూరు, మే 8 (రిపోర్టర్- దయాకర్ రెడ్డి): వింజమూరులోని పాతూరు ప్రాంతంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సింటెక్స్ ట్యాంకులలో శుక్రవారం నాడు పంచాయితీ సిబ్బంది క్లోరినేషన్ పనులు చేపట్టారు. ట్యాంకుల పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించడంతో పాటు సున్నం, బ్లీచింగ్ పౌడర్ లతో ట్యాంకులను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో గత 50 రోజులుగా పంచాయితీ పరిధిలో రెట్టింపు స్థాయిలో పారిశుద్ద్య పనులను ఉద్యమ తరహాలో నిర్వహిస్తున్నామన్నారు. వింజమూరు మేజర్ పంచాయితీ ప్రత్యేకాధికారిణి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ ఆదేశాల మేరకు తాగునీటి పధకాలను పరిశీలిస్తూ, లీకేజీలను అరికడుతూ ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య పనులకు అవసరమైన సున్నం, బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైడ్ ద్రావణాలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించి పారిశుద్ధ్యమును మెరుగు పరుస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా చెత్తా చెదారమును విచ్చలవిడిగా రోడ్లుపై పడవేయరాదన్నారు. ప్రతినిత్యం పారిశుద్ధ్య కార్మికులు వింజమూరులోని అన్ని ప్రాంతాలకు వస్తుంటారని, చెత్తను వారికి అందించిన పక్షంలో ప్రత్యేక వాహనాల ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తామన్నారు. ఫలితంగా నివాస గృహాల వద్ద అపరిశుభ్ర వాతావరణమును పారద్రోలవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసే వరకు కూడా స్వీయ నిర్భంధంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఇ.ఓ శ్రీనివాసులురెడ్డి విజ్ఞప్తి చేశారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image