ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేసిన సీఎం. 

*10–05–2020*
*అమరావతి*


*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై సాయంత్రం మరోమారు సీఎం సమీక్ష*
*కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్*


*విశాఖపట్నం :* 
*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆదివారం సాయంత్రం మరోమారు సీఎం సమీక్ష*
*విశాఖలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు
,సీఎస్‌ నీలం సాహ్ని, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సీఎం సమీక్ష*
పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందంటూ సీఎంకు వివరణ
*మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి*


– గ్యాస్‌ బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలని సీఎం ఆదేశం


–*రేపు ఉదయం నుంచి ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయటా కూడా పూర్తిస్థాయిలో రసాయనాల అవశేషాలు లేకుండా శానిటేషన్‌ కార్యక్రమాలు  చేపట్టాలని సీఎం ఆదేశం*


–*సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని సీఎం ఆదేశం.* 
*వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలన్న ముఖ్యమంత్రి.*


– ఆస్పత్రిలో వైద్యం తీసుకుని, డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరేంతవరకూ ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని ఆదేశాలు.
 వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని, తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్న సీఎం.


– రేపు ఉదయం మంత్రులు, అధికారులు కలిసి మరణించిన వారి 
కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం.


– గ్యాస్‌ లీక్‌ కారణంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆర్థిక సహాయం కోసం ప్రజలెవ్వరూ ఎక్కడా కూడా తిరగకుండా వారికి నేరుగా గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.
పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టాలన్న సీఎం. 


– తమకు అందాల్సిన సహాయం కోసం ప్రజలు ఎవ్వరూ కూడా పదేపదే విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి. 


– పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న అంశాన్ని నిపుణులు కూడా చెప్తున్నారంటూ సీఎంకు వివరణ.
 అయినా సరే.. ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేసిన సీఎం.
వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల ఉన్న స్టెరిన్‌ రసాయనాన్ని వెనక్కి పంపాలని సీఎం గట్టి ఆదేశాలు.
 కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంచేసుకుని ఈ పనిపూర్తిచేయాలన్న సీఎం.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image