డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పి.యం.రావు జన్మదిన సందర్భంగా  సేవా కార్యక్రమాలు

డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పి.యం.రావు జన్మదిన సందర్భంగా
 సేవా కార్యక్రమాలు


        గూడూరు, మే 1.(అంతిమ తీర్పు ) :                           శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,  టెక్నో మిన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ మైనింగ్ గ్రూప్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీపి.యం.రావు నెల్లూరు జిల్లాలోనే  మహా దాతగా పేరు సంపాదించుకున్నారు .
  ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్య ,అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం   అందించారు.   చైర్మన్ శ్రీ లక్ష్మి పి.యం రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నిరాశ్రయులకు ,అనాధలకు, నిరుపేదలకు  బియ్యం ,భోజనం ,పండ్లను పంపిణీ చేశారు. రైతు కూలీలకు భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా ట్రస్ట్ పి ఆర్ వో మల్లవరపు భూషణ్ రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణంలో లాక్ డౌన్ కారణం గా ప్రజలు ఆర్దికంగా ఇబ్బంది పడకుండా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న లక్ష్యంతో డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మిపి.యం.రావు దంపతులు ట్రస్టు ద్వారా teknomin కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ,రాష్ట్ర ప్రభుత్వానికి  20 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.  విజయవాడ పోలీస్ కమిషనర్ కు 15 వేల మాస్కులు 8000 గ్లౌసులు అందించారు.  గూడూరు పోలీస్ శాఖ ,రెవెన్యూ శాఖ కు  మాస్కులు, శానిటైజర్లు అందించారు.  కూరగాయలు పండించే రైతులు నష్ట పోకూడదు అని  ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద రైతుల వద్ద భారీగా కూరగాయలు కొనుగోలు చేసి గూడూరు పట్టణం, గూడూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని నిరుపేదలు రెండు వేల మందికి కూరగాయలను పంపిణీ చేశారు.   గుంటూరు ప్రాంతంలోని సిరిపురం, విజయవాడ ప్రాంతాల్లో కూడా పేదలకు కూరగాయలు పంపిణీ చేసారు.  అలాంటి మహాదాత డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మి గారి జన్మదినం పదిమందికి ఉపయోగపడే గా ఉండాలనే సంకల్పంతో ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని బియ్యం, పండ్లు, భోజనాలను పంపిణి చేసామన్నారు.ట్రస్టు ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేసే విధంగా పి.యం రావు దంపతులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రభు వెంకటరమణారెడ్డి  ట్రస్టు సిబ్బంది ఉదయ్ కిరణ్,  నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image