మామిడి తోటల్లో కాపలదరులకు  ఆహారం పంపిణీ. *ఎం. వి.రావు.ఫౌండేషన్ చేయూత

మామిడి తోటల్లో కాపలదరులకు 
ఆహారం పంపిణీ.
*ఎం. వి.రావు.ఫౌండేషన్ చేయూత.
కోట మే 7.
కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన ఎం.వి.రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోట మండలం 
 చెందోడు గ్రామానికి చెందిన ముప్పవరపు వేంకటేశ్వర రావు గారి జ్ఞాపకార్థం, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి,జాజగణమన రచయత రవీంద్ర నాథ్ టాగూర్ జయంతి,కవి ఆత్రేయ గారీ జయంతి నీ పురస్కరించుకొని గురువారం కోట మండలం లోని మామిడి తోటల్లో పనిచేస్తూ నివసించే నిరుపేద కుటుంబాలకు ,కూలీలకు , ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం,పండ్లు,కూరగాయలు పంపిణీ చేశారు.
గత నాలుగు నెలలుగా వారి యజమానులు ఇచ్చిన పిలుపు మేరకు మండలం లోని గిరిజనులు
మామిడి తోపులో కాపురాలు వుంటూ దుర్బర పరిస్ధితులను అధిగమిస్తున్నా రు.మామిడి తోపులో కాపురాలు వుంటూ అతి చిన్న పిల్లలను రాత్రి అనక పగలనక, విష జీవులను సైతం లెక్క చేయక తోపుల్లో జీవిస్తున్న గిరిజనులను సమీకరించి వారికి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బియ్యం, పండ్లు,కూరగాయలను,ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.
కోట,గుదలి, ఏ ఎస్ ఆర్ పురం, ఇతర ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం బియ్యం పండ్లు కూరగాయలను పంపిణీ చేశారు.