ప్రతీ నెలా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ లో ఉండాలన్నారు.

 విశాఖపట్నం .. మే 11..


         రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్  కుమార్ ప్రసాద్, పీ సి బి మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఎన్ డీ ఆర్ ఎఫ్ , వైద్య శాఖ, పరిశ్రమల శాఖ సాంకేతిక నిపుణులతో  సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. 


       ఈ నెల 7 వ తేదీన జరిగిన ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన  నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన  క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్సలు అందించడం, సంబందిత గ్రామాల ప్రజలను దూరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలావరకు పెద్ద ప్రమాదం నుండి తప్పించ గలిగారన్నారు. 
       గ్యాస్ లీకెజ్  సంభవించడానికి గల కారణాలు, ప్రస్తుతం తీసుకుంటున్న  చర్యలు తదితరాల తో కూడిన పూర్తి నివేదికను తయారు చేయాలని ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాన్ని కోరారు.
            ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల గూర్చి వైద్యాధికారుల ను ఆరా తీశారు. డిశ్చార్జ్ చేయబోయే ముందు ప్రతి ఒక్కరికీ అన్నిరకాల టెస్ట్లనునిర్వహించాలన్నారు.ముఖ్యంగా  చిన్న పిల్లలు, లంగ్స్, కిడ్నీ, హార్ట్ తదితర దీర్ఘకాలిక రోగుల పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. డిశ్చార్జ్ అయిన వారందరినీ మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతీ నెలా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ లో ఉండాలన్నారు.


     గ్యాస్ ప్రభావిత గ్రామాలలో  చెరువులు,నీటి కాలువలు, బావులలో నీటి శాంపిల్స్, మట్టి శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించాలన్నారు. పశువులు, పెంపుడు జంతువుల కు  సంబంధించి పశుసంవర్ధక శాఖ , వైల్డ్ ఆనిమల్స్ కు సంబంధించి అటవీ శాఖ ఆయా పరిస్థితుల పై నివేదికను అందజేయాలన్నారు.
       ఆయా గ్రామాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా  తమ ఇళ్లకు వెళ్లే వారు వ్యక్తి గత రక్షణ నిమిత్తం తప్పని సరిగా మాస్క్ లను ధరించడం,ఇంటి కిటికీలు తెరచి బాగా గాలి వెళ్లే విధంగా చూడడం,ఫ్యాన్లు, ఏసీ లు వాడకుండా చేపట్టాల్సిన జాగ్రత్త లను గూర్చి వారికి అవగాహన కల్పించాలన్నారు.
     ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా తిరుపతి రావు, డీ సి హెచ్ ఎస్ డా నాయక్, కే జి హెచ్ సూపరింటెడెంట్ డా అర్జున, ఎన్ డీ ఆర్ ఎఫ్ , సాంకేతిక నిపుణుల బృందం తదితరులు హాజరయ్యారు.
     
,