డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్లు గా వాసన పట్టి ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది

*కె జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ జి అర్జున్ పత్రిక ప్రకటన*
*డాక్టర్ కె సుధాకర్ రావు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ ఆసుపత్రి నర్సీపట్నం వారిని పోలీసులు కేజీహెచ్కు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తీసుకురాగా క్యాజువాలిటీ విభాగంలో పరీక్షించడం జరిగింది.


డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్లు గా వాసన పట్టి ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.


మద్యం ప్రభావం వలన అసభ్య పదజాలంతో అందరినీ తిడుతూ వైద్యానికి సహకరించలేదు అయినప్పటికీ అతికష్టం మీద వారి పల్స్ బీపీ లను పరీక్షించడం జరిగింది.


మద్యం మత్తులో ఉన్న కారణంగా రక్తంలో మద్యం శాతం పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్ కు పంపడమైనది.


తదుపరి చికిత్స నిమిత్తం ప్రభుత్వం మానసిక ఆస్పత్రికి తరలించారు.*


*డాక్టర్ సుధాకర్ రావు ఎక్యూట్ హ్యాండ్ add comment సైకో సిస్ తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగిందని ప్రస్తుతం ప్రభుత్వ మానసిక వైద్యశాల యంలో వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు.
డాక్టర్ రాధా రాణి
 సూపరిండెంట్ ప్రభుత్వ  మానసిక వికలాంగుల ఆసుపత్రి*