ఏపీలో రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులు

ఏపీలో రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులు
********************
*ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
*ఆంధ్రప్రదేశ్ లొ రేపటి నుండి  సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తాయి
* కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
*ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం.
*కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెడ్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. 
*లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం. *రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకురాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
*సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. *కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. 
*వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది.
* ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. *రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. 
*అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. 
*పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది.
* ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.