ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రవేశ పెట్టాలి : బిజెపి

అమరావతి, మే 6 (అంతిమ తీర్పు) :


*"మద్యం ద్వారా వచ్చే ఆదాయం కోసం అంత ఆత్రం ఎందుకు ? ఏపీలో 12జిల్లాలకు కరోనాతో ముప్పు ఉన్న వేళ సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తానన్న సీఎం గారు ఏ ఆలోచనతో మద్యం దుకాణాలు తెరిచారు? ఆదాయమే లక్ష్యంగా షాపులు తెరిచి వినియోగదారులను కంట్రోల్ చెయ్యలేక  రాష్ట్రాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేశారు."*
- *బిజెపి ఆంధ్రప్రదేశ్*


🔸సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన వైకాపా ప్రభుత్వం తర్వాత దశల వారీ నిషేధం అని మాట మార్చింది. ఇప్పుడు మద్యపాన నిషేధం చేసే అవకాశం వస్తే ఆదాయం కోసం వెంపర్లాడుతోంది.


🔸కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం అనే అంశాన్ని తుంగలో తొక్కి 
  కేంద్రం చెబితే దుకాణాలు ప్రారంభించామని తమ ప్రమేయం లేదని మాట్లాడడం సరికాదు.మద్యం అమ్మకం- ఆదాయం రాష్ట్ర పరిధిలోని అంశం.


🔸రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరిచి మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మార్చేందుకు వైకాపా ప్రభుత్వం కారణమౌతోందని, గ్రీన్ జోన్లను ఆరెంజ్, రెడ్ జోన్లుగా మార్చే విధంగా వైకాపా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.


🔸మద్యం విక్రయాలతో కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవడమే కాకుండా, మందు తాగే వ్యక్తులను అదుపు చేయడం కోసం ఉపాధ్యాయులను వినియోగించడం మహా పాపమని, ఘోర తప్పిదమని, చదువు చెప్పే గురువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విలువ అర్థం అవుతోంది.


🔸మందు బాబులను అదుపు చేయడానికి రాష్ట్రంలో ఉపాధ్యాయులను వినియోగించి గురువులను రాష్ట్ర ప్రభుత్వం అవమానించింది.


🔸ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మద్యం దుకాణాలు తెరవకుండా ఉంచారన్న విషయం తెలియదా అని..
రాష్ట్ర ప్రభుత్వాల సొంత నిర్ణయంతో మద్యం విక్రయాలు కట్టడి చేసే అవకాశం ఉందని తెలియదా అని బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రశ్నిస్తోంది..



🔸గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మద్యపాన నిషేధం మాట తప్పి జాతీయ రహదారులను కూడా మద్యం అమ్మకాల కేంద్రాలుగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈరోజు మద్యపాన నిషేధం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.


🔸ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు తెరచి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసిందని, ఇన్నాళ్లూ వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి అత్యవసర సిబ్బంది పడిన కష్టం అంతా బూడిదలో పోసినట్లు అయింది.



🔸మద్యం షాపులవద్ద ఎక్కడా భౌతిక దూరం పాటించటంలేదని, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలల్లో  
మద్యం షాపుల వద్ద  గుమిగూడిన జనాన్ని చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ తీరువల్ల కొరొనా వైరస్ మరలా విజృంభించే ప్రమాదం ఉంది.


🔸రెడ్ జోన్ లో అమ్మకాలు నిలిపివేసిన ప్రభుత్వం అక్కడి వారిని నియత్రించలేకపోతోందని వారంతా ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో స్వేచ్ఛగా తిరుతున్నారని, మద్యం దుకాణాల పేరిట జోన్ల వ్యవస్థ చెరిగిపోయి కరోన సామూహిక వ్యాప్తి జరిగే ప్రమాదం ఉంది.


🔸 ప్రభుత్వం అసంబద్ధ విధానాలు, అవగాహనా రాహిత్యంతో ప్రజల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తోంది.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
1. కొరొనా నియంత్రణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం  తక్షణం మద్యం దుకాణాలు మూసి వేయాలని  ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.


2. లాక్ డౌన్ కారణంగా సుమారు నలభై రోజుల పాటు మద్యం దొరకక పోవడంతో కొంత వరకు మద్య నిషేధం అలవాటు అయిందని ఈ నేపథ్యంలో తక్షణమే మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏపి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.


3. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులు విధులు నిర్వహించేలా చేసి ఉపాధ్యాయులను అవమానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ డిమాండ్ చేస్తోంది.