ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాగా చేస్తోంది: డా.మధుమిత*

కర్నూలు, మే 10 (అంతిమ తీర్పు) :


- *ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడి పై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో  సెంట్రల్ టీమ్ ప్రతినిధులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.మధుమిత దూబే మాట్లాడుతూ...*


*కోవిడ్-19 వైరస్ కట్టడికి చాలా అంశాల్లో, టెస్టింగ్ లో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాగా చేస్తోంది: డా.మధుమిత*


*కోవిడ్ కంట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి...కర్నూలు జిల్లా యంత్రాంగానికి హ్యాండ్ హోల్డ్/ చేయూత నివ్వడానికి వచ్చాము:డా.మధుమిత*


*కర్నూలు జిల్లాలో పరిస్థితులను పూర్తీగా పరిశీలించి.. కోవిడ్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కర్నూలు జిల్లా యంత్రాంగానికి సలహాలు, సూచనలు, గైడెన్స్ ఇస్తాము:డా.మధుమిత*


*కోవిడ్-19 వైరస్ కట్టడికోసం, కొత్త ఛాలెంజ్ ను ఎదుర్కోవడంలో  కర్నూలు జిల్లా యంత్రాంగం బాగా కృషి చేస్తోంది...అయితే పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ..అంతే వేగంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన వ్యూహాలను కూడా  సిద్ధం చేసుకుంటూ.. మార్చుకుంటూ... టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ ఇంకా వేగంగా జరగాలి.. కాంటాక్టు ట్రేసింగ్ లో ఎన్జిఓ ల సహకారం కూడా తీసుకోవాలి: డా. మధుమిత*


*భవిష్యత్తులో అనుకోనివి జరిగినా..అటువంటి ఛాలెంజ్ లను పగడ్బందీగా ఎదుర్కోవడానికోసం.. క్వారంటైన్ లు, కోవిడ్ కేర్ సెంటర్లు, హాస్పిటల్స్, హ్యూమన్ రిసోర్సెస్ సన్నద్ధతను ఇంకా పెంచుకోవాలి: డా.మధుమిత*


*సెంట్రల్ టీమ్ సభ్యులు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్  మాట్లాడుతూ... లాక్ డౌన్ ఎంతో కాలం ఉండదు..ఏదో ఒక రోజు లాక్ డౌన్ ను తీసేస్తారు..అందువల్ల కోవిడ్ వైరస్ తో కలిసి జీవించే విధంగా ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలి...కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం, కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రశంసనీయ కృషి చేస్తున్నారు..  కోవిడ్ వైరస్ పై విజయాన్ని సాధించడానికి తమ వంతు సహకారం అందిస్తాం అన్నారు*


*సమావేశం ముగింపులో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో, జిల్లాలో  అందరి సహకారంతో  కర్నూలు జిల్లాలో కోవిడ్ వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం యావత్తు టీమ్ కర్నూలు గా గత నెలన్నర నుండి అహర్నిశలు నిద్ర కూడా లేకుండా కృషి చేసి వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని చర్యలు చేపట్టాము... ఎంతో శ్రమకు ఓర్చి కోల్కత్తా నుండి హైదరాబాద్ వచ్చి..విజయవాడ వెళ్లి ..అక్కడి నుండి కర్నూలుకు  కేంద్ర బృందం రావడం చాలా సంతోషమ్..కేంద్ర బృందం సభ్యులు ఇచ్చే ఎంతో విలువైన సలహాలు, సూచనలను పాటించి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి నుండి జిల్లా ప్రజలను,  ఆరోగ్యాన్ని రక్షించడానికి, పాజిటివ్ కేసుల వ్యాప్తి నియంత్రణకు, మరణాల శాతాన్ని  తగ్గించడానికి కేంద్ర బృందం సహకారం తో మరింత స్పూర్తితో  కృషి చేస్తామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు* 
--------------------
DD I&PR Kurnool