క్వారంటైన్‌ కేంద్రాలపై నిరంతర పరిశీలన: సీఎం ఆదేశం

01–05–2020
అమరావతి


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం     వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి:
*– కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ్   వైయస్‌.జగన్‌ సమీక్ష*
*– వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు*


*క్వారంటైన్‌ కేంద్రాలపై నిరంతర పరిశీలన: సీఎం ఆదేశం


– క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలి: సీఎం
– వీటిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కృష్ణబాబుకు సీఎం ఆదేశం
–  సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం, మందులు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నామని అధికారుల వెల్లడి
– క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్‌ నంబర్‌ తమ వద్ద ఉందని, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ర్యాండమ్‌గా కాల్‌చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని సీఎంకు తెలియజేసిన అధికారులు


*ఇతర దేశాలు, రాష్ట్రాలనుంచి వచ్చేవారికి స్క్రీనింగ్, అవసరమైన వారికి క్వారంటైన్‌:*


– లాక్‌డౌన్‌ సడలింపులు నేపథ్యంలో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని సమావేశంలో చర్చ
– వీరిని స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ.
– వీరి సంఖ్య అధికంగా ఉండే అవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న సీఎం
– ఎవరిని క్వారంటైన్లో పెట్టాలి, ఎవర్ని ఎక్కడ పెట్టాలి అన్నదానిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం
– క్వారంటైన్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలన్న సీఎం
– అలాగే వివిధ రాష్ట్రాలనుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలని అ«ధికారులను ఆదేశించిన సీఎం
– దీనికి సన్నద్ధం కావాలని ఆదేశించిన సీఎం


– విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, 
వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని తెలిపిన అధికారులు
– అలాగే గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని,
అలాగే శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆ«ధారంగా ఇళ్లకు పంపిస్తామని తెలిపిన అధికారులు


*రాష్ట్రంలో లక్ష దాటిన కోవిడ్‌ –19 పరీక్షలు, ప్రతి మిలియన్‌కు 2వేలకు చేరువలో పరీక్షలు:*


– రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌ –19 పరీక్షలు
– నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు
– ప్రతిమిలియన్‌కు 1919 చొప్పున పరీక్షలతో దేశంలోనే అగ్రస్థానం. ప్రతి మిలియన్‌కు 2వేలకు చేరువలో పరీక్షలు


– ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు
– 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు
– 68 యాక్టివ్‌  క్లస్టర్లు
– 53 డార్మంట్‌ క్లస్టర్లు 
– 35  క్లస్టర్లలో  28 రోజుల నుంచి కేసులు లేవని వెల్లడించిన అధికారులు. 


*కోవిడ్‌ –19 మరణాలు తగ్గించేందుకు వ్యూహం:*


– కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారుల వెల్లడి.
– వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తింపు
– వీరికి పరీక్షలు చేసి... లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని సీఎం ఆదేశం
–  కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు
– జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని ఆదేశం
– హైరిస్క్‌ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్‌ చేస్తే.. వెంటనే వైద్యం అందించడానికి
ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు


– టెలిమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలన్న సీఎం
– భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం
– టెలీమెడిసిన్‌ద్వారా ప్రిస్కిప్షన్‌ పొందడం, అక్కడనుంచి నేరుగా విలేజ్‌ క్లినిక్‌ద్వారా మందులు సరఫరాచేయడం జరగాలన్న  ముఖ్యమంత్రి.
 
*వ్యవసాయం, అనుబంధ రంగాలు:*


– ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందన్న అధికారులు.
– ఒక్క కృష్ణాజిల్లాలో సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చ. 
– దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌
– ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్న సీఎం
– చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దని,  వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.  రైతులకు  అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టంచేసిన సీఎం. 


– పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవన్న సీఎం
– అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని అధికారులకు స్పష్టంచేసిన సీఎం
– చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాససింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం.
– వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల విషయంలో మార్కెటింగ్‌  సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. 


*రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లు:*


–  రైతు భరోసా కేంద్రాలకు నెట్, విద్యుత్‌ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలని సీఎం ఆదేశం
– ఏ ఊరిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని ఆర్‌బీకేల ద్వారా అవగాహన కలిగించాలన్న సీఎం
– ఏ పంట వేస్తే మార్కెట్‌లో మంచి ధరకు అమ్ముడు పోయే అవకాశాలున్నాయన్నదానిపై రైతులకు అవగాహన కలిగించాలి
– ప్రతి ఊర్లోకూడా ఏయే పంటలు ఎంతమేర పండించాలన్నదానిపై రైతులతో కలిసి కూర్చుని నిర్ణయించుకోవాలన్న ముఖ్యమంత్రి
– జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. ఆమేరకు కార్యాచరణ ఉండాలన్న ముఖ్యమంత్రి
– రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు సీఎం ఆదేశం
– ఏయే పంటలు, ఎక్కడ ఎంతమేర సాగుచేయాలన్నదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాలి. 
– ఈ బోర్డుల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
– రాష్ట్రస్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు, జిల్లా స్థాయి బోర్డులకు, అక్కడనుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి
– పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి
– దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతుంది.
– పంటలను ఇ– క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం.. ఈప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృతంగా సాగిపోవాలి. 


– గత ప్రభుత్వం హయాంలో ఏరోజూ వ్యవసాయం మీద దృష్టిపెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టి విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంతచేస్తున్నప్పుడు కచ్చితంగా ఫలితాలు రావాలన్న సీఎం.


Popular posts
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం
Image