పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ ...............ఆత్మకూరు పట్టణానికి చెందిన షేక్. సంధాని అనే వ్యక్తి డయాలసిస్ తో బాధపడుతు లాక్ డౌన్ వలన ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన తలపనోళ్ళ చెంచయ్య—పెంచలమ్మ అనే గిరిజన వృద్ధ దంపతులు ఎటువంటి అండదండలు లేకుండా వచ్చే పించనతో జీవనం సాగిస్తున్నారు... అలాగే చెంచయ్య కు బయట ప్రపంచం చూసే అవకాశం లేదు అతను ఒక అంధుడు... ఈ విషయాన్ని పట్టణానికి చెందిన ఐక్య ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి కి దృష్టికి తీసుకురావడంతో ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఆ రెండు కుటుంబాలకు బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, పొడమేకల ప్రదీప్, రియాజ్,నాయబ్, పారుఖ్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ