భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో పేదలకు ఆహారం మజ్జిగ పంపిణీ-నాగలక్ష్మి
విజయవాడ, మే 2 (అంతిమ తీర్పు) : ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ , జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేదవారికి ఈ లాక్డౌన్ సందర్భంగా ఆహార పదార్థాలను, రేషన్ పంపిణీ కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు,నాయకులు రాష్ట్రంలో అనేక సేవాకార్యక్రమలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శనివారం విజయవాడలో ఓక ప్రభుత్వ వైద్యశాల వద్ద మరియ రైల్వే లో బ్రిడ్జి కింద, రైల్వే పార్సిల్ కౌంటర్ వద్ద నివసిస్తున్న పేద,అనాధ,వికలాంగులకు భోజన ప్యాకెట్లు,మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు భాజపా మహిళా మోర్చా ఉపద్యక్షురాలు బొడ్డు నాగలక్ష్మి తెలిపారు.ఈ కార్యక్రమాలలో పలుపంచుకొంటున్న వివిధ స్వచ్చంద సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో పేదలకు ఆహారం మజ్జిగ పంపిణీ-నాగలక్ష్మి