రుయాలో వైద్య వసతులు మరింత మెరుగ్గా ఉండేలా చూడాలి.. జిల్లా కలెక్టర్
తిరుపతి, మే 04 : రుయా ఆసుపత్రి కోవిడ్ కు ప్రాధాన్యత నేపధ్యంలో ఆసుపత్రిలో చేపట్టాల్సిన వైద్య వసతులు పై జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇప్పటికే మెడిసిన్ వార్డు లో కోవిడ్ 150 పడకలు వున్నాయని, మరో 200 పాత మెటర్నేటీ సిద్దంగా ఉందని, అలాగే ఒకటి నిండితే తరువాత మరోకటి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రుయాలో మార్పు చేయదలచిన వార్డులో పనులు పూర్తి కావాలని వసతులు టాయిలెట్ లు, ఆక్సిజన్ లైన్ లు, బెడ్లు వంటివి సిద్ధంగా ఉండాలని సూచించారు. పిపిఐలు, ఎన్95 మాస్కులు అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
రుయా సూపరినెంట్ భారతి వివరిస్తూ ఎం.ఆర్.ఐ, సిటీ స్కాన్ పనిచేస్తున్నాయని నేడు ఒపి ప్రారంభించామని 382 మంది రోగులకు వైద్య సేవలు అందించామని అందులో 100 మంది కి కోవిడ్ టెస్టులు చేస్తున్నామని వివరించారు. ఇన్ పేషేంట్లను 22 మందిని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రలకు పంపామని తెలిపారు. ఓపి పేషంట్ల కోవిడ్ రిజల్టు వచ్చే వరకు పేషేంట్ల అటెండర్స్ వసతి కోసం ధార్మిమిటరీ కావాలని , నేటి వరకు 32 మంది కొత్తగా డాక్టర్లు విధుల్లో చేరారని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ తో ఆక్సిజన్ సరిపోతుందని వివరించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ లు కావాలని కోరారు.
ఈసమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పృద్వి తేజ్, ఆర్.ఎం.ఓ. ఇబి దేవి, సరస్వతి, ఏపీఎం ఐడిసి ఇఇ ధనంజయ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాల ఆంజనేయులు , తదితరులు పాల్గొన్నారు.