బహిరంగ లేఖ
శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి......
ముఖ్యమంత్రి వర్యులు,
ఆంధ్రప్రదేశ్,
నమస్కారములతో…
విషయం:- *సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉపాధి కోసం వెళ్లి చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు నేను సిద్ధం. రాష్ట్రంలోని జిల్లాకు 2 బస్సులు, తెలంగాణకు 10 బస్సులు నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి తిరిగి తెచ్చేందుకు అనుమతి కోరుతున్నాను.*
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వేలాది మంది వలస కార్మికులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఉపాధి లేక కనీసం తినడానికి తిండి లేక బ్రతుకు బండి గుదిబండలా మారాయి. ఆర్ధిక ఇబ్బందులు తాళలేక తెగించి దూరాన్ని లెక్కచేయకుండా గమ్యస్థానాలకు చేరేందుకు నడుం బిగించి కాలినడకన పయనమవుతున్నారు.
ఒక ప్రజా నాయకుడిగా సత్తెనపల్లి ప్రజల బాధలు, కష్టాలు తీర్చాల్సిన నైతిక బాధ్యత నాపై ఉంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో వేలాది మంది పేద ప్రజలకు, అసంఘటిత కార్మికులు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆర్ధిక సాయం అందించి వారికి అండగా నిలిచాను. అలాగే సత్తెనపల్లి నుంచి వలస వెళ్లిన కార్మికులను బస్సులు వివిధ రవాణా సౌకర్యాలు కల్పించి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను తీసుకుంటాను. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 2 బస్సులు అలాగే తెలంగాణలో చిక్కుకున్న సత్తెనపల్లి ప్రజలను తెచ్చేందుకు 10 బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. తగిన సౌకర్యాలు కల్పించి అందుకు అయ్యే వ్యయమంతా నేను భరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాను. దయచేసి అనుమతినించవల్సిందిగా కోరుచున్నాను.
ఇట్లు
రాయపాటి రంగబాబు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి
బహిరంగ లేఖ