12–05–2020
అమరావతి
*కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష*
అమరావతి:
– కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష
డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతవం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కెఎస్.జవహర్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి ఇతర సీనియర్ అధికారులు హాజరు.
– కరోనా పట్ల తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని మరో మారు స్పష్టం చేసిన సీఎం
– వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరి కాదన్న సీఎం
– వైరస్ పట్ల భయం, ఆందోళన తొలగించాల్సి ఉందన్న సీఎం
– దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
– వైరస్ పట్ల అవగాహన పెంచుకోవడంతోపాటు, చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్న సీఎం
– నిన్న ప్రధాన మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చేసిన ప్రసంగంపై పలువురి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయన్న అ«ధికారులు.
– కరోనా వైరస్ పట్ల భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందన్న మాటపై ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారన్న అధికారులు
– నిన్న రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కూడా తనతో మాట్లాడారన్న ముఖ్యమంత్రి
– కీలక అంశాలను ప్రస్తావించారంటూ తనతో అన్నారన్న సీఎం
– కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని నిన్న డిశ్చార్జి అయిన ఒక ఉద్యోగిని ఇంట్లోకి రానీయలేదన్న అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
– కరోనా పట్ల తీవ్ర భయాందోళనలు కారణంగా ఇలాంటి వివక్ష చూపిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న అధికారులు
తాజాగా 33 పాజిటివ్ కేసులు నమోదు:
– తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వారే 20 మంది ఉండగా, ముంబైలోని కళ్యాణ్ నుంచి అనంతపురం, కర్నూలు నుంచి వచ్చిన వారిలో 13 మంది పాజిటివ్ ఉన్నారు
– నిన్న ఒక్కరోజే 10,730 పరీక్షలు
– ఇప్పటి వరకు 1,91,874 పరీక్షలు చేసిన ఏపీ
– ప్రతి మిలియన్‌కు 3,594 పరీక్షలు
–రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.09 శాతం, దేశంలో 4.02శాతం
– మరణాల శాతం 2.20, దేశంలో 3.24 శాతం
– రికవరీ రేటు 50.55శాతం, దేశంలో 31.86శాతం
– హైరిస్క్ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి
– 60 సంవత్సరాల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై దృష్టి
– అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపైనా దృష్టి పెడుతున్నామన్న అధికారులు
– కోవిడ్‌యేతర రోగులకు చికిత్సలను సాధారణ స్థాయికి తీసుకు రావడంపై దృష్టి పెడుతున్నామన్న అధికారులు
ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి:
– మరింత ఉధ్ధృతంగా ధాన్యాన్ని సేకరించాలని సీఎం ఆదేశం
– రైతులకు పేమెంట్లు కూడా జరుగుతున్నాయని, అకాల వర్షాలు సంభవిస్తే మార్కెట్లలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
– తమిళనాడులోని కోయంబేడు నాలుగు జిల్లాలపై ప్రభావం చూపుతోందన్న అధికారులు.
– రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశం.
– చేపలు, రొయ్యల ఎగుమతులపై దృష్టిపెట్టాలన్న సీఎం
రైతు భరోసా కేంద్రాలు:
– రైతు భరోసా కేంద్రాలు సిద్ధమవుతున్నాయని, ఈనెల 30న వాటిని ప్రారంభించడానికి సిద్ధమని వెల్లడి.
– ఆర్‌బీకేలలో ఈనెల 15వ తేదీకల్లా కియోస్క్‌లు రెడీ అవుతాయన్న అధికారులు.
రైతు భరోసాకు సన్నద్ధమవుతున్నామన్న అధికారులు.