అక్రమాలకు అడ్డాగా ఉదయగిరి.. పోలీసులకు దొరికిన నాటు తుపాకీ. బుల్లెట్లు....
నిద్రావస్థలో నిఘా విభాగం
ఉదయగిరి... రెండు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా, నెల్లూరు జిల్లాకు చిట్టచివరి ప్రాంతం గా ఉన్న ఉదయగిరి పరిసర ప్రాంతాలు అక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. వన్యప్రాణుల వేట, ఎర్రచందనం నరికివేత, లక్షల్లో పేకాట, నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా నిఘా వ్యవస్థ మాత్రం నిద్రావస్థలో ఉందన్న ఆరోపణలు ఎదుర్కుంటూ ఉంది. ఆదివారం సీతారామపురం పోలీసులకు ఒక నాటు తుపాకీ 16 రౌండ్ల బుల్లెట్లు లభ్యం కావడంతో ఈ ప్రాంతంలో అక్రమార్కుల సంచారం విరివిగా జరుగుతుందన్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఉదయగిరి ప్రాంతం వెలిగొండ నల్లమల అడవులలో అంతర్భాగంగా వుంది. అపారమైన ఎర్రచందనం వృక్షాలు లు, అంతకంటే ఎక్కువగా సంచరించే వన్యప్రాణులు ఈ ప్రాంతానికి సొంతం. అంతేకాకుండా దట్టమైన అడవి ప్రాంతం కావడం నిఘా అంతగా లేకపోవడం ఇలాంటి కారణాలతో తో అడవులలో పేకాట స్థావరాలు, నాటుసారా కర్మాగారాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిత్యం అడవుల్లో సంచరిస్తూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిన అటవీశాఖ అధికారులు కార్యాలయాల కే పరిమితం అవుతుండడంతో అటవీశాఖ తనిఖీ కేంద్రాలు కూడా అలంకారప్రాయంగా మారిపోయాయి. ప్రస్తుత లాక్ డౌన్లోడ్ పరిస్థితుల్లో ప్రజలు విలవిలలాడి పోతున్నా అక్రమార్కులకు మాత్రం కలిసొచ్చేలా మారిపోయింది. సీతారామపురం మండలం లో ఇప్పటికి మూడు సార్లు లు నాటుసారా తరలించే వ్యక్తులను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం, ఉదయగిరి మండలం కొండ కింద పల్లెల్లో పోలీసులు తనిఖీ చేసి పేకాట స్థావరాలుగా ధ్వంసం చేయటం, తాజాగా సీతారామపురం పోలీసులకు ఒక నాటు తుపాకీ 16 రౌండ్ల బుల్లెట్లు లభ్యం కావడం ఈ ప్రాంతాన్ని కలవరపెడుతోంది, తుపాకి ఉపయోగించిన వాళ్ళు వన్యప్రాణుల వేట కోసం వచ్చారా? లేక ఎర్రచందనం స్మగ్లర్ల అనే విషయం అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చి మూడు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఉదయగిరి సీతారాంపురం మండలాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
సీతారామపురం పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటు తుపాకీ... .