ప్రజల చావుకు కారణం అయిన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారు : నారా లోకేష్

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...


అదే కోటి మీకిస్తాం చావడానికి సిద్దామా?అని ముఖ్యమంత్రి జగన్ గారిని,వైకాపా మంత్రులను
విశాఖ వాసులు,ఎల్జీ గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులు ప్రశ్నిస్తున్నారు.విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ మాకొద్దు అని ప్రజలు రోడ్డెక్కితే వారిని అరెస్ట్ చేస్తారా?


ప్రజల చావుకు కారణం అయిన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారు,అదో గొప్ప కంపెనీ అని కితాబు ఇచ్చారు.ప్రశ్నించిన ప్రజల్ని మాత్రం అణిచివేస్తున్నారు.పైగా మీ మంత్రులు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అంటూ అధికార మదం తో మాట్లాడుతున్నారు.


వారు వేసిన ఓట్లతోనే మీరు పెత్తనం చేస్తున్నారు అన్న విషయం మర్చిపోయి ప్రజల్ని అవమానిస్తూ మాట్లాడటం దారుణం.తక్షణమే దీనికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రజల డిమాండ్ కి అంగీకరించి కంపెనీ అక్కడి నుండి తరలించాలి.