ప్రకాశం జిల్లా ట్రాక్టర్ ప్రమాదంపై గ‌వ‌ర్న‌ర్ దిగ్భ్రాంతి 

ప్రకాశం జిల్లా ట్రాక్టర్ ప్రమాదంపై గ‌వ‌ర్న‌ర్ దిగ్భ్రాంతి
* మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన బిశ్వభూషణ్ 
ఏపి రాజ్‌భ‌వ‌న్‌(‌విజయవాడ): ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీకొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా, పలువురు మహిళలు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ‌భూష‌న్ హరిచందన్ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.