వింజమూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

వింజమూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ


వింజమూరు, మే 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో శుక్రవారం సాయంత్రం 9 మందికి 7 లక్షల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. స్థానిక వెలుగు కార్యాలయం సమావేశ మందిరంలో ఈ చెక్కులను భాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వై.సి.పి కన్వీనర్ పల్లా.కొండారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ప్రజల సం క్షేమమే ధ్యేయంగా ఆరోగ్యశ్రీ పధకమును ప్రవేశపెట్టారన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి ఆశయాలను కొనసాగిస్తుండటం గర్వించదగిన విషయమన్నారు. తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ సి.యం రిలీఫ్ ఫండ్ చెక్కులు భాధిత కుటుంబాలకు ఎంతగానో ఊరటనిస్తాయన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధికంగా లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు సి.యం. సహాయనిధి చెక్కులు వారి కుటుంబాల ఆర్ధిక పరిస్థితుల మెరుగుకు దోహదపడతాయన్నారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు సహకారంతో భాధితులకు చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సొసైటీ చైర్మన్ మద్దూరి.చిన్నిక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో సి.యం.రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, పోరెడ్డి.జగన్ రెడ్డి, జక్కం.మోహన్ రెడ్డి, లెక్కల.సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.