ఊరువాడ లా సంయుక్త సేవలు ...
కావలి ,మే 10 (అంతిమ తీర్పు - N.సాయి )
సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో తుమ్మలపెంట గిరిజన ప్రాంతం నందు 80 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి దాతలు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంచర్ల భరత్ కుమార్, ఎలక్ట్రికల్ ఉద్యోగి ఆత్మకూరు శ్రీనివాసులు మరియు వంశి సహకరించారని వ్యవస్థాపకుడు సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా దాత భరత్ కుమార్ మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని, నేను కూడా ఈ సంస్థ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు గంధం ప్రసన్న ఆంజనేయులు , శ్రీనివాసులు , వంశీ మరియు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షుడు ఘనీ బాష మరియు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు .