ఎపిలో వేసవి సందర్బంగా మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. :పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

 


03.05.2020


అమరావతి 


 


- ఎపిలో వేసవి సందర్బంగా మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. :పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


- గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు అత్యంత ప్రాధాన్యత. 


- ముందస్తు వేసవి ప్రణాళికతో మంచినీటి ఎద్దడికి చెక్. 


- వేసవిలో మంచినీటి కోరత లేకుండా గ్రామీణ నీటిసరఫరా విభాగం ద్వారా చర్యలు. 


- ముందుచూపుతో జనవరిలోనే రూ.204.75 కోట్లతో వేసవి ప్రణాళిక రూపకల్పన 


- దీనిలో భాగంగా రూ.5.80 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పనులు... 


- 2440 బోర్ బావులకు ఫ్లషింగ్ చేయడం.. 


- 968 బోరు బావులను మరింత లోతు చేయడం... 


-325 ఎస్ఎస్ ట్యాంక్ లలో పూడికతీత పనుల నిర్వహణ. 


- ఈ ఏడాది జూన్ వరకు ఈ ప్రణాళిక ప్రకారం మంచినీటి సరఫరా. 


- రాష్ట్ర వ్యాప్తంగా 8242 హ్యాబిటేషన్లలో మంచినీటి ఎద్దడి గుర్తింపు. 


- ఆర్ డబ్ల్యుఎస్ ద్వారా అన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న మంచినీటి సరఫరా 


- మొత్తం 2837 హ్యాబిటేషన్ లకు రోజుకు 13,488 ట్యాంకర్ ట్రప్పులతో కొనసాగుతున్న మంచినీటి సరఫరా



- 17.68 లక్షల మందికి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఆర్ డబ్ల్యుఎస్. 


- రూ.20.19 కోట్లతో 2055 హ్యాబిటేషన్ లలో పశువుల కోసం తాగునీటి సరఫరా 


- చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో పశువుల కోసం మంచినీటి సరఫరా. 


- రాష్ట్రంలోని 347 ప్రైవేట్ బోర్ వెల్స్ ద్వారా 330 హ్యాబిటేషన్లకు మంచినీటి సరఫరా 


- మండల స్థాయిలో మంచినీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు 


- ఆర్ డబ్ల్యుఎస్ ఇంజనీర్లు, పంచాయతీ ఇఓఆర్డీ, ఎంపిడీఓలతో పర్యవేక్షణ 


- స్పందనలో తాగునీటిపై వచ్చే ప్రతి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి 


- ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు. 



 జిల్లాల వారీగా గుర్తించిన హ్యాబిటేషన్లు, కంటిన్యుటీ ప్లాన్ :


-------------------------------------------------------------------------- 
జిల్లా   హ్యాబిటేషన్లు  వ్యయం (రూ.కోట్లలో...) 
-------------------------------------------------------------------------- 
శ్రీకాకుళం  150   1.71 
విజయనగరం  45   0.03 
విశాఖపట్నం  209   0.27 
తూర్పు గోదావరి  388   0.63 
పశ్చిమ గోదావరి  200   1.68 
కృష్ణా   577   9.85 
గుంటూరు  326   12.12 
ప్రకాశం   980   52.95 
నెల్లూరు   466   11.40 
చిత్తూరు   3103   52.49 
కడప   1064   31.60 
అనంతపురం  498   17.97 
కర్నూలు  236   12.07 
------------------------------------------------------------------------------------ 


- వైఎస్ఆర్ సుజల పథకంకు రూ.46.56 కోట్లతో అంచనాలు 


- రాష్ట్రంలో 46.56 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజల పథకం కింద మంచినీటి సరఫరా 


- శ్రీకాకుళం జిల్లాలో 5 క్లస్టర్ లకు రూ.31 లక్షలు.. 


- విశాఖపట్నం జిల్లాలో 7 క్లస్టర్ లకు రూ.61 లక్షలు...



- తూర్పు గోదావరిజిల్లాలో 3 క్లస్టర్ లకు రూ. 40 వేలు... 


- కృష్ణాజిల్లాలో 4 క్లస్టర్ లకు రూ.25 లక్షలు... 


- గుంటూరు జిల్లాలో 5 క్లస్టర్ లకు రూ.2.69 కోట్లు.. 


- ప్రకాశం జిల్లాలో 18 క్లస్టర్ లకు రూ.37 లక్షలు... 


- నెల్లూరు జిల్లాలో 14 క్లస్టర్ లకు రూ.16.68 కోట్లు... 


- చిత్తూరు జిల్లాలో 12 క్లస్టర్ లలో రూ.32 లక్షలు.. 


- కడపజిల్లాలో 5 క్లస్టర్ లలో రూ.90 లక్షలు.. 


- అనంతపురం జిల్లాలో 22 క్లస్టర్ లకు రూ.18.87 కోట్లు.. 


- కర్నూలు జిల్లాలో ఎనిమిది క్లస్టర్ లకు రూ.6.34 కోట్లతో ప్రతిపాదనలు 


- స్టేట్ డెవలప్ మెంట్ స్కీం కింద రాష్ట్రం వ్యాప్తంగా రూ.55.86 కోట్లతో సోలార్ స్కీంల నిర్వహణ