ట్యాంకు టెంపరేచర్ క్రమేణా తగ్గుతూ వస్తుంది         – రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి


తేది:08.05.2020


ట్యాంకు టెంపరేచర్ క్రమేణా తగ్గుతూ వస్తుంది         – రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి



  విశాఖపట్నం, మే 8: ఎల్.జి. పాలీమర్స్ లీకేజీ ట్యాంకు టెంపరేచర్ క్రమేణా తగ్గుతూ వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. ఎల్.జి. పాలీమర్స్ ను శుక్రవారం ఆయన సందర్శించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ లీకేజీ ట్యాంకు పరిస్థితి ఏవిధంగా ఉన్నది, ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, వాటిలో కెమికల్స్ వివరాలు, వాటి పరిస్థితి, ఉష్ణోగ్రత, పారామీటర్స్ వివరాల గురించి పాలీమర్స్ యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. వాతావరణంలో రసాయనాలు జీరో స్థాయి వస్తేనే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆ గ్రామాలకు తిరిగి నివాసం ఉండొచ్చని చెప్పారు.  సాంకేతిక నిపుణుల బృందం కూడా వస్తుందని, అదనంగా సెఫ్టీ మెజర్స్ సేకరణ చేస్తామని చెప్పారు.  ప్రతీ గంటకు పొల్యూషన్ స్థాయి ఏ విధంగా ఉన్నదీ తెలుసుకొని తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  కంపెనీ పరిసర వాతావరణంలో రసాయనాల పరిస్థితి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తీసుకొనవలసిన చర్యలను గురించి అధికారులు, యాజమాన్యంతో చర్చించినట్లు పేర్కొన్నారు. 


 


........