వింజమూరు మాజీ జడ్.పి.టి.సి ' పులిచర్ల ' దాతృత్వo

*వింజమూరు మాజీ జడ్.పి.టి.సి ' పులిచర్ల ' దాతృత్వo వింజమూరు, మే 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మాజీ జడ్.పి.టి.సి సభ్యులు, పులిచర్ల.నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులిచర్ల.వెంకట నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు వలస కార్మికుల పట్ల ఆదివారం నాడు తమ దాతృత్వమును చాటుకున్నారు. వ్యాపార రీత్యా తరచూ గుంటూరుకు వెళుతున్న పులిచర్ల. నారాయణరెడ్డి స్వతహాగా నెల్లూరీయులను అక్కడ కూడా ఆదరిస్తూ వారికి వ్యాపారపరంగా చేయూతనిస్తూ బాసటగా నిలుస్తుంటారనే పేరుంది. అయితే ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో లాక్ డౌన్ కారణంగా గుంటూరులోనే ఉండిపోయిన పులిచర్ల.నారాయణరెడ్డి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200 మంది వలస కార్మికులకు కాజా టోల్ గేట్ వద్ద ఎన్.హెచ్-16 రోడ్డులో ఆహార పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చరవాణి ద్వారా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలు సాహసోపేతమైనవిగా నారాయణరెడ్డి అభివర్ణించారు. వలస వాసులకు ఆసరాగా నిలిచిన ఈ ఆహారం అందించే కార్యక్రమంలో పులిచర్ల. అరుణకుమారి, పులిచర్ల. పృద్ధ్వీరెడ్డి, అంకినపల్లి.పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.