తెలుగు రాష్ట్రాలలో రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..

తెలుగు రాష్ట్రాలలో రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
 
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని నిర్ణయించిన కేంద్ర రైల్వే శాఖ అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ప్రయాణ సదుపాయం ఉంటుందని రైల్వే శాఖ మరోమారు స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే శాఖ ప్రకటించిన తాజా జాబితాలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రెండు రైళ్లు మాత్రమే స్టాప్స్‌లో ఆగుతాయి. మే 13న న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్లే రైలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, వరంగల్‌ రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.
మే 12న న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే రైలు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు ఉన్నప్పటికీ అది కేవలం తెలంగాణలో సికింద్రాబాద్‌లో మాత్రమే ఆగుతుంది. ఈలోపు తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఏ ఒక్క చోట స్టాప్ లేదు. పరిమిత స్టాప్స్ విషయంలో రైల్వే శాఖ తీసుకున్న ఓ నిర్ణయమైతే స్పష్టమైంది. ఈ ప్రత్యేక రైళ్లు రాష్ట్రానికో స్టాప్‌లో మాత్రమే ఆగుతాయి. అయితే.. ఏపీకి ప్రత్యేకంగా రైలు లేకపోవడంతో అనంతపురం, గుంతకల్లు జంక్షన్‌లో ఆగేందుకు వెసులుబాటునిచ్చారు.


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image