నిబంధనలు ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠినంగా  వ్యవరిస్తాం :ఆంధ్ర ప్రదేశ్ డి‌జి‌పి గౌతమ్ సవాంగ్

 
నిబంధనలు ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠినంగా  వ్యవరిస్తాం :ఆంధ్ర ప్రదేశ్ డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS..


అమరావతి మే 5 (అంతిమ తీర్పు) :


మూడో విడత లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా దేశవ్యాప్తంగా  కొన్ని సడలింపులు చేస్తూ మద్యం విక్రయాలకు కూడా   మార్గదర్శకాలు విడుదలయ్యాయి.  రాష్ట్ర ప్రభుత్వ ఎంపిక చేసిన కంటైన్మెంట్ జోన్, పరిసర ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాలలో మద్యం విక్రయిచేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మద్యం కొనుగోలుదారులు కచ్చితంగా  నిబంధనల పాటించాలి.


నిర్ణీత సమయంలోనే షాపుల వద్ద క్రమపద్దతిలో విక్రయాలు జరపాలి, మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా దుకాణాల వద్ద  భౌతిక దూరం పాటించాలి, ఖచ్చితంగా మాస్క్ దరించాలి, మద్యం  దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదు. నిభందనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తాం. అదే విధంగా మద్యం సేవించి గొడవలకు దిగడం,ఇతరులను వేదించడం, వివాదాలు సృస్టించడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం  కల్పించే విధంగా వ్యహరించే  వారిపైన  జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము.అలాంటివారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుంది.