ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 

ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్


       వింజమూరు మే.2 (అంతిమ తీర్పు) :       వింజమూరు మండలం కావలి-ఉదయగిరి రోడ్డులో పెట్రోలు బంకుల వద్ద ఉన్న డాబా హోటళ్లలో పని చేస్తున్న సుమారు 30 మంది కూలీలు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారని సమాచారం  తెలుసుకున్న కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ జాతీయనిది పర్యవేక్షక కమిటీ సభ్యులు వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి శనివారం నాడు వారికి 100 కిలోల బియ్యం, 50కిలోల గోధుమ పిండి, 10కిలోల ఉల్లిపాయలు, 50కిలోల వివిధ రకాల కూరగాయలు, 10లీటర్ల నూనె వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన తన మిత్రుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న సిముని గోవింద రెడ్డి మరియు చుండి నాగార్జున రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక సొంత ఊరికి చేరుకోలేక, ఎవరి ఆదరణకూ నోచుకోని పొట్ట చేత పట్టుకుని వచ్చిన వలస కూలీలను పలువురు దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని,  ఇప్పటికీ కరోనా విజ్రంభిస్తున్న నేపద్యంలో కేంద్రం లాక్ డౌన్ ను మరో 14 రోజుల పాటు పొడిగించిందని, ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సలహాలు పాటిస్తూ ఏకతాటిపైకి వచ్చి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపూడి కిషోర్, విశాఖ పార్లమెంటు బిజెపి ప్రచారక్ శ్రీరామ్ శ్రీనివాసులు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కౌషిక్, మల్లం కొండారెడ్డి, నోటి మల్యాద్రి రెడ్డి, మూలా బాలకృష్ణా రెడ్డి, సక్షమ్ బాద్యులు సిముని వెంగళరెడ్డి, దారా వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.