వైకాపా నాయకులకు   జె ట్యాక్ష్ మీద ఉన్న శ్రద్ధ   విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు :అనగాని సత్యప్రసాద్


3-05-2020
అనగాని సత్యప్రసాద్ 
రేపల్లె శాసనసభ్యులు


వైకాపా నాయకులకు   జె ట్యాక్ష్ మీద ఉన్న శ్రద్ధ   విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు. 


రేయనక పగలనక  కష్టించి  చదువుకున్న   పదవ తరగతి విద్యార్థులకు  కరోనా సాకుతో  పరీక్షలు వాయిదా వేసి  వారి  భవిష్యత్తును అంధకారంలో పడవేశారు.  భౌతిక దూరం పాటించి పరీక్షలు నిర్వహించ లేరా?  పరీక్షలు వాయిదా వేయడంతో  పదో తరగతి విద్యార్థులు  తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.  విద్యార్థులకు అండగా నిలిచి  విద్యార్థుల్లో మనోధైర్యం నింపే విధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు  చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఆదాయం పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారు తప్ప  పదో తరగతి  విద్యార్థుల పరీక్షలు  నిర్వహించడానికి  ఏ పరిష్కార మార్గం  ప్రభుత్వం  సూచించలేదు.  ఎప్పటి లోపు  పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారో  ప్రభుత్వం చెప్పాలి?  పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో  తెలియక  విద్యార్థులు వారి తల్లిదండ్రులు  ఆందోళన చెందుతుంటే  ప్రభుత్వానికి  కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఆదాయం తగ్గుతుందనే  బాధ తప్ప  విద్యార్థుల బాధలు పట్టవా?  ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు   కరోనాను  సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు   మత్తు పదార్థాలు,  మాదకద్రవ్యాలను  నిషేధిస్తే  ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం  మద్యం అమ్మకాలకు  సీఎం జగన్ పచ్చజెండా ఊపడం  దేనికి సంకేతం?   మద్యం ఏమన్నా  నిత్యావసర సరుకా?  అత్యవసర సేవా వైకాపా నాయకులు చెప్పాలి?  మీ జె  ట్యాక్ష్ కక్కుర్తితో  రాష్ట్రం పరువు తీస్తున్నారు.   కరోనా మహమ్మారిని    సమర్థవంతంగా ఎదుర్కోవడానికి  స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తే  నిస్సిగ్గుగా  ఎన్నికల కమిషనర్ పై కుల  దూషణలకు పాల్పడిన వైకాపా నాయకులు  పదవ తరగతి  పరీక్షల గురించి మాట్లాడకపోవడం  బాధాకరం?  సేవాభావంతో పాలించ వలసిన సీఎం  లాభాపేక్ష కోసం వ్యాపారి లాగా  మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇస్తూ  ప్రజా ఆరోగ్యం తో చెలగాటమాడుతున్నారు.   నేటి బాలలే  రేపటి పౌరులు  కానీ జగన్ దృష్టిలో మాత్రం  నేటి   మద్యం అమ్మకాలే  రేపటి   జె ట్యాక్ష్ కు   ఆదాయ మార్గాలు అన్నట్లు  మద్యం అమ్మకాలను  ప్రోత్సహిస్తున్నారు.  మద్యం తాగిన వ్యక్తులు  సామాజిక దూరం పాటిస్తారా?   మద్యం  ఏమైనా కరోనాకు  మందా?  సామాజిక దూరం  పాటింప చేస్తూ పరీక్ష  నిర్వహించలేని  ఈ అసమర్థ  విద్యా శాఖ మంత్రి  రాజీనామా చేయాలి?   నిర్వహించిన శాఖలకే  వన్నెతెచ్చిన  మంత్రుల నుంచి  శాఖలను భ్రష్టు పట్టించిన  మంత్రుల స్థాయికి   జగన్  దిగజార్చడం  ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం.


                                                         S/d
                                         అనగాని సత్యప్రసాద్ 
                                          రేపల్లెశాసనసభ్యులు


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image