వింజమూరులో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ
వింజమూరు, మే 2 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో శనివారం నాడు కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా హైపోక్లోరైడ్ ద్రావణమును పంచాయితీ సిబ్బంది ప్రత్యేక ట్రాక్టర్ల ద్వారా పిచికారీ చేశారు. బంగ్లాసెంటర్ నుండి బస్టాండు కూడలి, పంచాయితీ బస్టాండు, నడిమూరు, కొత్తూరు, యర్రబల్లిపాళెంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ద్రావణమును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మారుమూల ప్రాంతాలకు సైతం వ్యాపించిందన్నారు. అందులో భాగంగా ఈ వైరస్ నిర్మూలనకు గానూ పారిశుద్ద్య పనులను రెట్టింపు స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా పంచాయితీ అధికారి, స్థానిక యం.పి.డి.ఓ ఆదేశాల మేరకు నిరంతరం ముమ్మరంగా పారిశుద్ద్య పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు నాగిరెడ్డి, నరేంద్ర, పంచాయితీ సిబ్బంది బువ్వన.వెంకటేశ్చర్లు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.