వింజమూరు క్వారంటైన్ లో భోజనాలు పరమ అధ్వాన్నం

వింజమూరు క్వారంటైన్ లో భోజనాలు పరమ అధ్వాన్నం


మీ ఇళ్ళలో మీరు కూడా ఇలాగే తింటున్నారా... మాకు వచ్చే భోజనాలు మీరూ తినండి...ఏ.సి గదులు వీడి వింజమూరు క్వారంటైన్ సెంటరును పరిశీలించండి... 


వింజమూరు, మే 14 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని శ్రీ రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో భోజనాలు సక్రమంగా లేవని క్వారంటైన్ సెంటర్లో ఉన్న పలువురు తమ ఆవేదనను వెలిబుచ్చారు. కూలీ నాలీ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన మేము అక్కడ పనులు లేకపోవడంతో తిరిగి వచ్చామన్నారు. అధికారులు తమను క్వారంటైనుకు తరలించారని, ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో తాము కూడా అధికారులకు సహకరిస్తున్నామన్నారు. కానీ భోజనాలు సరిగా లేవని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఏమవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఆదేశాలు జారీ చేయడం చాలా సులభతరమని, ఇప్పటికే మమ్మల్ని అంటరాని వారీగా చూస్తున్నారని, వింజమూరు క్వారంటైన్ సెంటరును తనిఖీ చేస్తే మీకు అర్ధమవుతుందని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.