జగన్ నష్టపరిహారం ప్రకటించి వెళ్లి  ప్యాలెస్ లో ఉన్నారు : వంగలపూడి అనిత

09.05.2020


జగన్ నష్టపరిహారం ప్రకటించి వెళ్లి  ప్యాలెస్ లో ఉన్నారు, బాధితులు మృత్యువుతో  పోరాటం చేస్తున్నారు


జగన్ విశాఖ ఎందుకెళ్లారు? యాజమాన్యాన్ని ఓదార్చడానికా, బాధితులను పరామర్శించడానికా?


                వంగలపూడి అనితవిశాఖ గ్యాస్ లీకేజీ ఘటన లో బాధితులకు ముఖ్యమంత్రి నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుని వెళ్లిపోయారు.
 విషవాయువును పీల్చి అస్వస్థతకు గురైన వారిని ఇప్పుడు కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. 554 మంది బాధితుల్లో 52 మంది చిన్నారులే ఉన్నారు. తాజాగా, బాధితుల్లో శరీరం కమిలిపోతుంది. కొందరికి ఒంటిపై బబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత శరీరంపై దురద, మంట ఏర్పడుతోందని అనంతరం చర్మం కమిలిపోయి బబ్బలు వస్తున్నాయి. దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిన్న పిల్లల భవిష్యత్ ను పాడు చేసారు. వారు పెద్ద వారైనా ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి.
  
  రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది.దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేయాలి.
చనిపోయిన వారికి కోటి ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ముఖ్యమంత్రి నష్ట పరిహారం ప్రకటించి వెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు, కానీ గ్యాస్ ప్రభావితా గ్రామాల ప్రజలు రోడ్ల పై
 ఉన్నారు.విశాఖ వెళ్లిన జగన్ కనీసం గ్యాస్ లీకేజీ కి కారణమైన ఫ్యాక్టరీ ని ఎందుకు సందర్శించ లేదు. ఘటన కు కారణమైనఫ్యాక్టరీ  యజమాన్యాన్నీ భాదితులను పరామర్శించక ముందే ఎందుకు కలిశారు?  అసలు జగన్ విశాఖ ఎందుకు వెళ్లారు. బాధితులను పరిమర్శించ డానికా, లేక ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఓదార్చడానికా?
ప్రభుత్వ వైఫల్యలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న జగన్ ప్రభుత్వం, నిర్లక్ష్యంగా వ్యహహరించి ప్రజల ప్రాణాలు తీసిన ఎల్జి పాలిమర్స్  కంపెనీ ప్రతినిధులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?S/d


వంగలపూడి అనిత
టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image