బత్తాయిలు ఎగుమతి కి మార్గం సుగమం

బత్తాయిలు ఎగుమతి కి మార్గం సుగమం
వరికుంటపాడు ,మే 13:
మండలం లో సాగవుతున్న బత్తాయి పంట కు ఎట్టకేలకు రవాణా సౌకర్యం సుగమం అయింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రైతులు ధర లాభసాటి గా ఉన్న సమయం లో కరోనా భూతం వెంటాడి లొక్డౌన్ రూపం లో ఎగుమతులు నిలిచిపోయే విదంగా చేసింది. ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి పండించిన సాగు సుమారు రెండు నెలలుగా రవాణా సౌకర్యం లేక నేల రాలిపోతుండేవి. ప్రభుత్వం పండ్ల తోటల పైన ఆంక్షలు సడలించడం తో కొనుగోలుదారులు ముందుకి వస్తున్నారు. ధర గిట్టుబాటు కాకపోయినా కాయలను చెట్లలోనూ ఉంచలేక అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. టన్ను సుమారు 15 వేలు లోపే ధర పలకడం తో చేసేది లేక రైతులు పండ్లని అముకుంటున్నారు. ఉదయగిరి మండలం దాసరిపల్లి కి చెందిన కొందరు దళారులు  బత్తాయి లను కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రము లోని బెంగళూరు, మైసూర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని మండలం లోని కాంచెరువు, పెద్దిరెడ్డి పల్లి, రామాపురం, పామూరు పల్లి, తూర్పు రొంపిదొడ్ల కి చెందిన రైతులు పేర్కొంటున్నారు