వలస కూలీల పట్ల తన మానవతను చాటుకున్న ఎపి సిఎస్ నీలం సాహ్ని

వలస కూలీల పట్ల తన మానవతను చాటుకున్న ఎపి సిఎస్ నీలం సాహ్ని.


వలస కూలీలకు ఆశ్రయం కల్పించి భోజన వసతి కల్పించి శ్రామికులు రైళ్ళలో స్వరాష్ట్రాలకు చేర్చాలని కృష్ణా,గుంటూరు జెసి లకు ఆదేశం.


అమరావతి,15మే: లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో.. స్వంత గూటికి చేరుకుని అయిన వారితో కలిసి కలో గంజో తాగైనా బతకొచ్చని.. ఎంత కష్టమైనా  రాత్రనక పగలనక కాలినడకన సొంతూరు చేరుకోవాలనే లక్ష్యంతో ఎంతోమంది వలస కూలీలు నగరాలు పట్టణాల నుండి సొంతూరు బాట పట్టారు.అలాంటి వలస కూలీల పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తన మానవతను చాటుకున్న సంఘటన శుక్రవారం విజయవాడ సమీపంలో చెన్నై-కోలకతా జాతీయ రహదారపై చోటుచేసుకుంది.


శుక్రవారం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి వర్యులతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె విజయవాడ కు తన వాహన శ్రేణి తో వస్తుండగా జాతీయ రహదారపై గుంపులు గుంపులుగా పిల్లా పాపలతో తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని రాత్రనక పగలనక మండుటెండను సహితం లెక్క చేయకుండా  వందలాది కిలోమీటర్లు నడిచి వెళుతున్న వలస కూలీలు తారస పడ్డారు. వెంటనే సిఎస్ నీలం సాహ్ని తన కారు ఆపి వలసకూలీలతో వారి మాతృ భాషలోనే మాట్లాడి వారు ఎక్కడ నుండి ఎక్కడకు వెళుతుందీ వారి బాగోగులను అడిగి తెలుసుకుని చలించిపోయిరు. చెన్నై నుండి వారి స్వరాష్ట్రం బీహార్ కు వెళుతున్నట్టు కూలీలు వివరించారు.దీనిపై  సిఎస్ వెంటనే కృష్ణా,గుంటూరు జిల్లాలో సంయుక్త కలెక్టర్లకు ఫోన్ చేసి ఈవిధంగా నడిచి వెళుతున్న వలస కూలీలందరికీ ఆశ్రయం కల్పించి వారికి భోజనం ఇతర వసతులు కల్పించాలని తదుపరి ఏర్పాటు చేసే శ్రామిక్ రైళ్ళలో వారిని వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఈవిధంగా తమ కష్టాలను అడిగి తెలుసుకుని తమకు ఆశ్రయం కల్పించి స్వరాష్ట్రానికి చేర్చేందుకు రాష్ట్ర ఉన్నతాధికారి తమ పట్ల ఎంతో మానవతను చాటుకోవడం పట్ల అక్కడున్న వలసకూలీలు అందరూ కన్నీటి పర్యంతమై సిఎస్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈసంఘటన రాష్ట్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
మహా నవరాత్రి ఉత్సవాల కుంకుమ పూజలు చేసి పెద్ద ఎత్తున మహా అన్నదానం................
Image
పవన్ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్...