ప్రశ్నించు పేద వాడి గొంతుకై గర్జించు : మహాజనసైన్యం సురేంద్ర జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు

మహాజనసైన్యం(MJS) *మహాజనసైన్యం సురేంద్ర*  మాట్లాడుతూ పసిబిడ్డ తల్లి రొమ్ములో పాలు లేక,రాక పసికందు ప్రాణాలు విడిచింది.తినడానికి తిండి లేక తల్లి రొమ్ము ఎండిపోయి పాలు ఇంకి పోయాయి,పేదవాడి డొక్క ఎండిపోయి బక్కచిక్కి పోయాడు.చేతిలో పనిలేక కడుపు మంట కన్నీళ్ల రూపంలో తెలుస్తుంది.ఆకలికి అన్నం లేక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.వీరెవరు పేద వాళ్లుగా కనిపించలేదు,మన మోడీకి,మన ప్రభుత్వాలకి,ఆర్.బీ.ఐకి వీళ్ళ దృష్టిలో పేదవారంటే (1)మెహుల్ చోక్సీ - 8,048కోట్లు పీ.యన్.బి కుంభకోణం ప్రధాన నిందితుడు,(నక్షత్ర బ్రాండ్) (2)విజయ్ మాల్యా -  1,943కోట్లు,(3)వెంకటరామిరెడ్డి -  1,915 కోట్లు,(4)ఆర్.ఈ.ఐ  - 4,314 కోట్లు,
(5)విన్సమ్ డైమెండ్స్ - 4,076 కోట్లు, (6)రోటో మాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ -  2,850 కోట్లు,(7)కుడోస్ కెమీ లిమిటెడ్ - 2,326 కోట్లు,(8)రుచి సోయా - 2,212 కోట్లు, (9)జూమ్ డేవలపర్స్ - 2,012 కోట్లు, (10)ఫరెవర్ ప్రీషియస్ జ్యుయెల్లరి అండ్ డైమెండ్స్ - 1,962 కోట్లు,(11)డక్కన్ క్రానికల్ హోల్డింగ్ లిమిటెడ్ - 1,915 కోట్లు దాదాపు 68 వేలకోట్లు పై చిలుకు రుణ మాఫీ చేసింది.సాకేత్ గోఖలే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆర్.బి.ఐ ని కోరి సేకరించారు.ఇంకా తెలియని నిజాలు లెన్నో దాగి ఉన్నాయి.అడిగినటువంటి సమాచారం కొంత అందిచక పోవటం కొసమెరుపు.ఇదిలాఉంటే రద్దయిన బాకీలకు సంబంధించిన సంస్థలలు సీబీఐ,ఈడీ దర్యాప్తులో మునిగి తెలుతున్నాయి.(2014 నుండి నిరుడు సెప్టెంబర్ వరకు ప్రభుత్వం 6.66 లక్షల కోట్లు రద్దు చేసిందనే ఆరోపణలు మూటకట్టుకుంది)ఇప్పుడు నేను పైన చెప్పిన వీరే నికార్సైన కడుపు మండే పేద వారు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.ఇటువంటి వ్యవస్థలో పుట్టినందుకు సిగ్గు పడాలి,ఇటువంటి వ్యక్తులు మనల్ని  పాలిస్తునందుకు,ఓట్లు వేసి వారిని ఎన్నుకున్నందుకు నిన్ను నువ్వే చెప్పుతో కొట్టుకోవాలి,ఇది మన వ్యవస్థ పనితీరు.ఇటువంటి కార్పొరేట్ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని మహాజనసైన్యం(MJS) వ్యతిరేకిస్తూ లాక్ డౌన్ కాలానికి సంబంధించి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డ్ ప్రాతిపదికన నెలకు పదివేలు బేషరతుగా ఇవ్వాలి.అంతేకాకుండా ప్రతి పేద కుటుంబానికి సంబంధించిన ప్రతి నెల కట్టే లాక్ డౌన్ కాలానికి సంబంధించిన పూర్తి మొత్తం  ఇన్స్ట్రల్మెంట్ ను  స్థానిక ప్రభుత్వాలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రజల పక్షమో,బకాయిలు ఎగ్గొట్టే కార్పొరేట్ దొంగల పక్షమో తేలిపోతుంది అని దుయ్యబట్టారు.  *జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు*  *ప్రశ్నించు పేద వాడి గొంతుకై గర్జించు*