నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి

నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి


వింజమూరు, మే 4 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం వద్ద బ్రాహ్మణ పండితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నామని వింజమూరు మాజీ మండలాధ్యక్షులు, వై.సి.పి జడ్.పి.టి.సి అభ్యర్ధి గణపం.బాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి మాజీ జడ్.పి.టి.సి సభ్యురాలు గణపం.సుజాతమ్మలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మారుమూల ప్రాంతాలకు సైతం సోకడం విషాదకరమన్నారు. ఈ వైరస్ నియంత్రణలో భాగంగా మన దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలు పతనమవుతున్నప్పటికీ ప్రజల సం రక్షణ, సం క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు లేకపోవడంతో పలు ప్రాంతాల పేదలు పస్తులుండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అందులో భాగంగా ఇటీవల 3 టన్నుల కూరగాయలను తమ స్వంత నిధులతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దైవత్వం ఫరిఢవిల్లే ఆలయాలకు కూడా లాక్ డౌన్ నిబంధనలు వర్తించడంతో అర్చకుల జీవనగమనం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన పినతండ్రి గణపం.ఓబులురెడ్డి జ్ఞాపకార్ధం ఆయన సతీమణి సౌజన్యంతో బ్రాహ్మణులకు నిత్యా వసర సరుకులను పంపిణీ చేయనున్నామన్నారు. ఈ కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు వింజమూరు మండలంలో పలువురు దాతలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కూరగాయలు, వంట సరుకులు అందజేయడం శుభపరిణామని ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి దాతలందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు.