కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటగిరి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని సిబ్బందికి కరోన కిట్స్:

కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటగిరి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని సిబ్బందికి కరోన కిట్స్:

*వెంకటగిరి     మే 9 :  పట్టణంలోని కవచ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది శ్రీ. గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో    శనివారం   రైల్వే స్టేషన్ రోడ్ లోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని సిబ్బందికి కరోన కిట్స్  అందజేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కరోన సంక్షోభంలో తమ సిబ్బంది చేస్తున్న కృషికి అభిమానంతో కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో కరోన కిట్స్  ఇవ్వడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ కుమార్ మాట్లాడుతూ సారా తయారీని, బెల్టుషాపులను నిరోధించడంలో నూ ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వం విధించిన ఆంక్షలను అమలు చేయడంలోనూ వెంకటగిరి ఎక్సైజ్ శాఖ విశిష్ట కృషి చేస్తుందని అన్నారు.ఈ సందర్బంగా కవచ చారిటబుల్ ట్రస్ట్ కు సహకరిస్తున్న అమెరికాలో ఉంటున్న భువనగిరి మనోజ్ కుమార్ కు గుండు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవచ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ గుండు మనోజ్ కుమార్ తో పాటు ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ గారు మరియు వారి సిబ్బంది, వెంకటేశ్వర ప్రెస్ అధినేత శ్రీ కోన వెంకటేశ్వర రావు, ట్రస్ట్ సభ్యులు తమట0 శివకుమార్, తమటం హరీష్, రాఖీ, డాక్టర్ బొక్కసం రమేష్, శివకుమార్, సుమన్, సాయి పాల్గొన్నారు.
..........