వింజమూరులో ఇంటింటికీ సామాజిక ఫించన్లు పంపిణీ

వింజమూరులో ఇంటింటికీ సామాజిక ఫించన్లు పంపిణీ వింజమూరు, మే 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో శుక్రవారం నాడు మే 1 వ తేదీని పురస్కరించుకుని వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి అర్హులైన లబ్ధిదారులకు సామాజిక ఫించన్లను పంపిణీ చేశారు. గ్రామ పంచాయితీలోని 5 సచివాలయాల పరిధిలో 2265 మంది ఫించను దారులు ఉండగా ఉదయం 6 గంటల నుండి వాలంటీర్లు ఫించన్ల జాబితాలను చేత పట్టుకుని లబ్ధిదారుల నివాసాల వద్దకు చేరుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని ఆదేశాల మేరకు మాస్కులు, గ్లౌజులు ధరించిన వాలంటీర్లు ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకుంటూ ఉత్సాహంగా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బి.సి కాలనీ, గంగమిట్ట, పాతూరు, నడిమూరు, యర్రబల్లిపాళెం ప్రాంతాలలో జరుగుతున్న ఫించన్లు పంపిణీని పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. పంచాయితీ పరిధిలోని 5 సచివాలయాలకు సంబంధించి 97 మంది వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సామాజిక ఫించన్లు పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.