త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పంపిణీ ఆదోని,మే,13( అంతిమతీర్పు) :- ఆదోని పట్టణంలో 2020 -21సంవత్సరానికి గాను రైతు సోదరులకు రైతు భరోసా డబ్బులు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఆదోని మండలానికి సంబంధించి మొత్తం 26,559 ఖాతాలకు గాను 23,094 ఖాతాలు అప్రూవ్ చేసి పంపడం జరిగిందని కావున రైతు సోదరులు అందరూ తమ యొక్క బ్యాంకు ఖాతాలను ఆక్టివ్ లో ఉంచుకో వలసినదిగా రైతులందరికీ సూచించడం జరిగిందని మండల వ్యవసాయశాఖ అధికారి తెలిపారు.ముక్యంగా రైతులకు తెలియ జేయడం ఏమనగా రైతు సోదరులు అందరూ తమ యొక్క బ్యాంకు అకౌంట్స్ నకు ఆధార్ లింక్ మరియు యాక్టివ్ లో ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాల వారీగా రైతు భరోసా కేంద్రాలలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయశాఖ అధికారి పాపిరెడ్డి తెలిపారు.
త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పంపిణీ