వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం - గట్టుచప్పుడు కాకుండా జిల్లాకు చేరుతున్న నకిలీ విత్తనాలు, గ్లైసిల్ -  విచ్చలవిడిగా మార్కెట్లో :- బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు

          Date: 06/05/2020
వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం - గట్టుచప్పుడు కాకుండా జిల్లాకు చేరుతున్న నకిలీ విత్తనాలు, గ్లైసిల్ -  విచ్చలవిడిగా మార్కెట్లో :- బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.
      గుంటూరు మే 6,(అంతిమ తీీర్పు) :                               గట్టుచప్పుడు కాకుండా జిల్లాకు నకిలీ హైబ్రిడ్ మిరప విత్తనాలు, గ్లైసిల్ బిటీ ప్రత్తి విత్తనాలు, గ్లైసిల్ గడ్డి మందులు చేరుతున్నాయని   బీజెపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు.
ఖరీఫ్‌ సాగుకు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారని, రాష్ట్రంలో ఖరీఫ్‌లో సుమారుగా 22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారని,  జిల్లాలో ఖరీఫ్‌లో సుమారుగా 5 లక్షల పైగా హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారని, అందులో రాష్ట్రంలో  వరి సుమారుగా 7 లక్షల 80 వేల హెక్టార్ల, జిల్లాలో వరి సుమారుగా 2 లక్షల 8 వేల హెక్టార్ల, ప్రత్తి సుమారుగా 1 లక్షల 95 వేల హెక్టార్ల, మిరప సుమారుగా 68 వేల హెక్టార్ల వరకు రైతులు పత్తిసాగు వైపు మొగ్గుచూపుతారు. రైతుల ఆశలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే కలుపు నివారణ మందు గ్లైసిల్ విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా వీటి అమ్మకాలు మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్నాయని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పట్నం బజార్ పల్నాడు లోని సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల సబ్ డివిజన్లలో ఈ గ్లైసిల్ నాణ్యత లేని బయో పురుగు  మందులు, నకిలీ విత్తనాలు, ఎరువులు ఎక్కువగా క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని నిరోదించడానికి వ్యవసాయ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో ప్రత్తి మరియు మిరప పంటలు ఎక్కువగా సాగుచేస్తారని , అందువలన అన్ని ప్రముఖ పెద్ద చిన్న కంపెనీల తేడా లేకుండా వారు ఈ నాణ్యత లేని నకిలీ పురుగు మందులు తయారు చేసి ఎక్కువగా గుంటూరు జిల్లాలో అమ్మకాలు జరుగుతుంటాయని వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వలన మరియు పై అధికారుల మరియు ఇతర  వత్తిళ్ళ వలన వ్యవసాయ శాఖ అధికారులకు అన్ని విషయాలు తెలిసినా కానీ పట్టిపట్టనట్టుగా ఉంటున్నారని దానివలన అమాయక రైతులు నష్ట పోవలసివస్తున్నదని ఆవేదన చెందారు. వ్యవసాయ శాఖ కరెక్ట్ గా పనిచేస్తే రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా మందులు అమ్మలేవని తెలిపారు.
పంపిణీదారులు  పొరుగు రాష్ట్రాల నుండి మన రాష్ట్రము లోని జిల్లాలకు సరఫరా చేసి అక్కడినుండి రైతుల పేరులతో నేరుగా రవాణా కార్యాలయాల ద్వారా వారికీ అందిస్తున్నారన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఆగష్టు 2019 నుండి గ్లైసిల్ మందు అమ్మకాలపై నిషేధం అమలులోనికి వచ్చిందని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఉన్న నిల్వలు పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతానికి పార్సిల్ వాహనాల ద్వారా తరలిస్తుండగా తమిళనాడు రాష్ట్రంలో  గ్లైసిల్ మందు అమ్మకాలపై నిషేధం అమలులో లేనందున అక్కడి నుండి నెల్లూరు జిల్లా మీదుగా గుంటూరు జిల్లాలోనికి ఈ గ్లైసిల్ చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారికంగా అమ్మకాలు ఎక్కడా జరుగడం లేనికారణంగా ఎక్కడా కూడా రికార్డు కాదు కాబట్టి వ్యవసాయ అధికారులకు తెలిసినా కూడా కొన్ని వత్తిళ్ళ వల్ల అధికారులు నిర్లక్ష్యం గా ఉంటున్నారని అధికారులు కార్పొరేట్ సేవలో నిమగ్నమై రైతుకు సేవచేయుటలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్లైసిల్, గ్లైసిల్ అని కాకుండా మార్కెట్లోకి రెండు కొత్త పేర్లతో వచ్చిన రసాయన మందు సులభంగా దొరుకుతున్నదని బిల్లులు మాత్రం వ్యాపారులు ఇవ్వడంలేదని తెలిపారు. గ్లైసిల్ గడ్డి మందు వలన భూమి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జీవులు పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతున్నదని ప్రభుత్వం అమ్మకాలను నిషేదించినా రైతులు దాని వాడకాన్ని విరమించుకోలేక పోతున్నారని ఆవిధంగా అధికారులు  రైతులకు అవగాహన కలిగించలేక పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు గ్లైసిల్ గడ్డి మందు, నకిలీ బయో, పురుగు మందుల పై ఉక్కుపాదం మోపి నకిలీలను అరికట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని బీజెపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు తెలిపారు.                                                                        
ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు అమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం వ్యవసాయశాఖ, పోలీస్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుంటున్నా నకిలీ పత్తి విత్తనాలు రావడం ఆగడంలేదు. రైతుల ఆశలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు గ్రామాలకు చేరుకున్నాయని భావిస్తున్నానని, మరోవైపు పత్తి, మిరప సాగులపై రైతులకు ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వివిధ కంపెనీలు విత్తనాల అమ్మకాలపై చేస్తున్న ప్రచారం రైతులను అయోమయానికి గురిచేస్తోందని, ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 విత్తనాలు కూడా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జరుగుతుంటాయని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image