బుక్కాపురంలో వై.సి.పి నేతలచే కూరగాయలు పంపిణీ

బుక్కాపురంలో వై.సి.పి నేతలచే కూరగాయలు పంపిణీ


వింజమూరు, మే 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో శుక్రవారం నాడు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మండలాధ్యక్షుడు గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఉహించని రీతిలో మానవాళి మనుగడకు పెను ప్రమాదంగా పరిణమించిన కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి
చంద్రశేఖర్ రెడ్డి ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రజల ఇబ్బందులను గుర్తెరిగి కూరగాయలు అందజేస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా లాక్ డౌన్ సమయంలో స్వీయ నిర్భంధంలో ఉండి కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా దాత కాటం.శ్రీనివాసులురెడ్డిని వై.సి.పి నేతలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల కన్వీనర్ మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, వై.సి.పి యువజన విభాగం నేత గణపం.రమేష్ రెడ్డి, స్థానిక వై.సి.పి నేతలు కాటం.రమణారెడ్డి, యర్రా.భాస్కర్ నాయుడు, సిద్ధం రెడ్డి.రాజగోపాల్ రెడ్డి, బి.తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.