*07–05–2020
గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
*తీవ్రంగా అస్వస్థతకు గురైన వారికి రూ.10లక్షలు*
*స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి రూ. 1 లక్ష*
*ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి రూ.25వేలు*
*ప్రభావిత గ్రామాల్లోని వారికి రూ.10వేలు*
*మరణించిన పశువులకు పూర్తి పరిహారం*
*ప్రమాద ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ*
*మంత్రులను విశాఖలోనే ఉండమని ఆదేశం*
*సహాయ కార్యక్రమాలకోసం రెండు రోజులపాటు విశాఖలోనే సీఎస్*
*అన్నిరకాలుగా ఆదుకుంటామన్న సీఎం*
*కేజీహెచ్‌లో బాధితులకు పరామర్శ, తర్వాత అధికారులతో సమీక్ష*
*సమీక్ష అనంతరం మాట్లాడిన సీఎం*
అమరావతి:
హెలికాప్టర్‌లో విశాఖ వెళ్లిన సీఎం
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన సీఎం
అందుతున్న వైద్య సౌకర్యాలు, చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
ఆంధ్రా మెడికల్ కాలేజీలో అధికారులతో సమీక్షా సమావేశం
సమీక్ష తర్వాత మాట్లాడిన సీఎం
ఫ్యాక్టరీ ఉపయోగించుకుంటున్న ముడిపదార్థం ఎక్కువరోజులు నిల్వ ఉంచుకోవడం వల్ల గ్యాస్ లీక్ అయ్యింది:
గ్యాస్ లీక్ దుర్ఘటన దురదృష్టకరం :
జరిగిన ప్రమాదానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తాం:
ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ సెక్రటరీ
పీసీబీ సెక్రటరీ, విశాఖ జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం వీరితో కమిటీ :
కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం:
తెల్లవారు జామున ఘటన జరిగినప్పుడు ప్రమాద హెచ్చరిక ఎందుకు రాలేదు? :
హెచ్చరికలు లేకపోవడం అన్నది దృష్టిపెట్టాల్సిన అంశం:
నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం:
ఘటన జరిగిన వెంటనే అధికారులు చాలా బాగా స్పందించారు:
వారిని అభినందిస్తున్నా :
నాలుగున్నర గంటలకే ఏసీపీ కూడా ఘటనా స్థలానికి చేరారు:
అంబులెన్సులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, వాటిని తరలించి
దాదాపు 348 మందిని అన్ని ఆస్పత్రుల్లో చేర్పించారు:
పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నవారు కూడా ... ఇప్పుడు వెంటిలేటర్‌కూడా అవసరంలేని స్థాయికి చేరుకున్నారు:
ఇప్పటివరకూ 9 మంది మరణించారని అధికారులు చెప్తున్నారు:
ఈ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా:
మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా మనసున్న మనిషిగా అన్నిరకాలుగా తోడుగా ఉంటాను:
మరణించినవారి కుటుంబాలకు కంపెనీ తరఫున ఎంత రాబట్టాలో అంత రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం:
చనిపోయిన వారందరి కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం:
ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుంటున్న వారందరికీ రూ. 25వేలు:
అస్వస్ధతతో ఆస్పత్రుల్లో కనీసం రెండు,మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఉన్నవారందరికీ కూడా రూ. 1 లక్ష పరిహారం ఇస్తున్నాం:
తీవ్ర అస్వస్ధతకు గురై వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నవారికి రూ.10లక్షలు పరిహారం ఇస్తున్నాం:
ఏ ఒక్కరూ కూడా వైద్యంకోసం ఒక్కరూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు:
అలాగే గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలపై ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది:
*గ్యాస్ కారణంగా ప్రభావిత గ్రామాలు*
వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ– ఎస్టీకాలనీ, నందమూరినగర్, పద్మనాభపురం గ్రామాల్లోని ప్రజలంతా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరంలేదు:
ఈ గ్రామాల్లోని దాదాపు 15వేలమంది ఉంటారని చెప్తున్నారు:
వీరందరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు ఇస్తున్నాను:
మెడికల్‌క్యాంపులు పెట్టమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నాం:
గ్రామాలకు వెళ్లలేని వ్యక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేసి మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం:
కమిటీ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం :
చీఫ్ సెక్రటరీగారిని వచ్చే 2 రోజులు ఇక్కడే ఉండమని ఆదేశాలు ఇస్తున్నాం:
ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు అవంతి, బొత్సలు కూడా ఇక్కడే సహాయకార్యక్రమాలకు పర్యవేక్షణ చేస్తారు:
ఈ గ్రామాలకు ఎలాంటి సమస్యరాకుండా చూసుకోమని చెప్తున్నాను:
ప్రభావిత గ్రామాల్లో కొన్ని పశువులు కూడా చనిపోయాయని చెప్తున్నారు:
దీనికి పూర్తి పరిహారం ఇవ్వాలనిచెప్పాం:
దీనికి అదనంగా పశువుకు రూ.20 వేల చొప్పున ఇవ్వమని ఆదేశాలు ఇస్తున్నాం:
మరణించిన వారిని తీసుకురాలేకపోయినా... ఆయా కుటుంబాలకు తోడుగా ఉంటాం:
కమిటీ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటాం...:
తర్వాత బాధిత కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు చేపడతాం:
అందర్నీ ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాలుగా ముందు ఉంటుంది: