మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ దాతృత్వంతో కూరగాయలు పంపిణీ

             గూడూరు  మే 3 (అంతిమ తీర్పు) ::  కరోనా లాక్ డౌన్ లాంటి కష్ట కాలంలో గూడూరు పురపాలక ప్రజలకు ఆపద్బాంధవుడిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిలిచి వేలాది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడి గుడ్డు లు పంపిణీ చేస్తూ తన దాతృత్వాని చాటుతున్నారు, ఈనేపథ్యంలోఆదివారంనాడుగూడూరు పట్టణంలోని బీసీ కాలనీ నందు 400 కుటుంబాలకు  కూరగాయలను అందించిన మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ దాతృత్వంలో పంపిణీ చేశారు,గూడూరు పట్టణం  32 & 33 వార్డు బి సి కాలనీ నందు నివసిస్తున్న పేద కుటుంబాలకు కూరగాయలు(టమోటా,వంకాయి క్యాబేజీ, మామిడికాయ,పచ్చిమిర్చి,మరియు ఎర్రగడ్డల)ను 400 కుటుంభాలకు పంపిణి చేయమని వార్డు వాలంటర్లకుమాజీ శాసన సభ్యులు పాశం.సునీల్ కుమార్అందజేసారు,అనంతరం  విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ
కరోనా లాక్ డౌన్ వలన ప్రజలు ఎదుర్కోనుచున్న ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టి లో పెట్టుకుని లాక్ డౌన్ పెంచిన ప్రధానమంత్రి  కి ధన్యవాదాలు తెలిపారు.ఇలా ముందస్తు జాగ్రత్తలు నరేంద్ర మోడీ  తీసుకున్నారు కాబట్టే ప్రపంచoలోని దేశాలు కన్నా మన భారతదేశంలో ఈ కరోనా ప్రభావం తక్కువుగా ఉన్నదని తెలిపారు.ఈ కరోనా వైరస్ నివారణకు మందులు లేవు కనుక దీనికి మనం ఇంటి నుండి బయటకు తిరగకుండా స్వీయ నిర్భంధం చేసుకోవాలని తెలిపారు.గూడూరులో పుట్టి పెరిగినందుకు తనవంతు సాయంగా పేదలకు ఈ సేవాకర్యక్రమాలను చేస్తున్నాని, అలాగే ఈ రోజు గూడూరు నియోజకవర్గంలో పార్టీలకతీతముగా ప్రజలకు సేవచేస్తున్న దాతలకు, స్వచ్చంద సేవాసంస్థలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిచేస్తున్నాని తెలిపారు.కరోనా వైరస్ భారిన పడకుండా ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ, బౌతికదూరం పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచురామయ్య, పట్టణ అధ్యక్షులు పులిమి.శ్రీనివాస రావు,టౌన్ మైనారిటీ సెల్ అద్యక్షులు రహీమ్,ప్రధాన కార్యదర్శి నరసింహులు,మాజీ కౌన్సిలర్లువాటంబేటి.శివకుమార్,కొణతం.సురేష్,సరస్వతమ్మ,నాయకులు ఛాన్ బాషా,జబ్బార్,ఉమర్, మోహన్,హరిబాబు తదితరులు పాల్గొన్నారు.