*క్వారంటైన్ సెంటరులో హైపోక్లోరైడ్ పిచికారీ* వింజమూరు, మే 6 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటరులో బుధవారం నాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కనకదుర్గా భవానీ ఆదేశాల మేరకు హైపోక్లోరైడ్ ద్రావణమును పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఇతర ప్రాంతాల రెడ్ జోన్ల నుండి వింజమూరు మండలానికి వచ్చే వలసవాసులకు వైద్యం అందించేందుకు స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలోని కొన్ని గదులను క్వారంటైన్ సెంటరుగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ పంచాయితీ అధ్వర్యంలో క్వారంటైన్ సెంటరు వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ద్య పనులను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా క్వారంటైన్ గదులలో హైపోక్లోరెడ్ ద్రావణమును పిచికారీ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు నాగిరెడ్డి, నరేంద్ర లు పాల్గొన్నారు
వింజమూరు క్వారంటైన్ సెంటరులో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్న దృశ్యం ..