*గర్భవతులకు వైద్య పరీక్షలు*


వింజమూరు, మే 9 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): ప్రధానమంత్రి మాతృత్వ సురక్షా అభియాన్ పధకం క్రింద వింజమూరులోని పాత ప్రభుత్వాసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్ నేతృత్వంలో గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీజాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృత్వ పధకం కింద తల్లి, బిడ్డల సం రక్షణకు అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో సమదూరం పాటిస్తూ 17 మందికి వైద్య సేవలు అందించి తగు సూచనలు, సలహాలు పాటించాలని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ గిరికుమారి, జయలక్షి, గురవయ్య, సుగుణకుమారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.