విశాఖ ప్రమాద ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి

*విశాఖ ప్రమాద ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి


*ఒకటిన్నర కి.మీ పరిధిలో ప్రభావం అధికంగా ఉందని వెల్లడి*


*వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు*


*గాల్లోకి నీటిని పిచికారీ చేసి ప్రభావాన్ని తగ్గించినట్టు మంత్రి వివరణ*


వైజాగ్ నగరంలో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదైంది. వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి లీకైన విషవాయువు తీవ్ర ప్రభావం చూపింది. ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీకేజీకి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైందని వెల్లడించారు.
ప్రస్తుతం గ్యాస్ లీకేజీ నిలిచిపోయిందని, ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీటిని పిచికారి చేసి వాతావరణంలో విషవాయువు ప్రభావాన్ని నియంత్రించినట్టు మంత్రి వివరించారు. పరిశ్రమల శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషవాయు ప్రభావం ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి ఒకటిన్న కిలోమీటరు పరిధిలో అధికంగా ఉందని తెలిపారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image