ప్రజలపై విద్యుత్తు చార్జీలను పెంచడం సరికాదు

ప్రజలపై విద్యుత్తు చార్జీలను పెంచడం సరికాదు


,ఎమ్మిగనూరు, గోనెగండ్ల, మే,11 (అంతిమతీర్పు):- వైకాపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలపై విద్యుత్ చార్జీల భారంమోపడం  సరికాదనితెలుగుదేశంపార్టీనాయకులుతిరుపతయ్య,విద్యార్థిఅనుబంధసంఘము(టీఎన్ఎస్ఎఫ్)మండల అధ్యక్షులు రంగస్వామినాయుడు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో సామాన్య మధ్య  తరగతి కుటుంబాలు పనుల్లేక ఇంటికి పరిమితం అయ్యి ఉంటే వారి పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం నేడు విద్యుత్ చార్జీల మోత మోగించడం ఏమిటని వారు ప్రశ్నించారు.వైకాపా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే విద్యుత్తు చార్జీలు తగ్గిస్తాం అని మాయమాటలు చెప్పి  అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా రోజు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ సమక్షంలో విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గిస్తామని చెప్పి నేడుమన ఆంధ్రప్రదేశ్  అపద్దాల ముఖ్యమంత్రిగా చరిత్ర పుట్టలోకి ఎక్కారన్నారు.విద్యుత్ చార్జీలు మీటర్లలో యూనిట్ల రీడింగ్ ఆధారంగా బిల్లులు వసూలు చేస్తారు.కానీ కరోనా ప్రభావంతో గత నెలలో మీటర్లలో రీడింగ్ కొట్టని కారణంగా మినిమం చార్జీల పేరుతో గత నెలలో చెల్లించాల్సిన బిల్లులు ఆన్ లైన్ లో చెల్లించినా కూడా,నేడు గత నెల, ఈ నెలతో కలిపి రెండు నెలల్లో యూనిట్లు  ఆధారంగా డబల్ చార్జీలు వసూలు చేయడం అన్యాయమని అన్నారు.ఈ చార్జీల పెనుభారం ఆధారంగా ఒక్కో ఇంట్లో 5 వందల నుండి 5 వేల వరకు ప్రజల నుండి ప్రభుత్వం నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటన్నారు.విద్యుత్ చార్జీలు 200 యూనిట్లు దాటితే పింఛన్లు,300 యూనిట్లు దాటితే రేషన్ కార్డులు తొలగిస్తారనిప్రజలుఆందోళనచెందుతున్నారన్నారు.నేడు రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి 200 యూనిట్లు మించి రావడం ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమిటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వారు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేసారు.నేడు ఈ యూనిట్ల ఆధారంగా ప్రతీ ఇంట్లో పింఛన్లు,రేషన్ కార్డులు ఎక్కడా పోతాయో అన్న బాధ ఒక వైపు మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు కట్టడం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని వారు తెలిపారు.ప్రభుత్వం ప్రజల యొక్క పరిస్థితులను కళ్ళు ఉండి కూడా చూడలేని పరిస్థితిలో ఉందని వారు తెలిపారు.ఈరోజు గోనెగండ్లలో ప్రతీ ఇంటికి విద్యుత్ చార్జీలు సామాన్య ప్రజలకు భారంగా మారిందనవారు అన్నారు.ఇదే విషయాన్ని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను సంప్రదిస్తే ఏఈ ఉలిగయ్య సరియైన సమాధానం చెప్పలేకపోతున్నారనిటిడిపి నాయకులు,విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్నాయకులుతెలిపారు.ఇప్పుడున్నా కరోనా పరిస్థితుల్లో ప్రజలు పనులు లేక అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెనుభారం ప్రజలు చెల్లించే పరిస్థితుల్లో లేరని, విద్యుత్ చార్జీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల విద్యుత్ చార్జీలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు లక్ష్మీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.