తిరివిధి ప్రసాద్ సేవలు ఆదర్శనీయం ... ఎమ్మెల్యే రామిరెడ్డి

తిరివిధి ప్రసాద్ సేవలు ఆదర్శనీయం ... ఎమ్మెల్యే రామిరెడ్డి


కావలి ,మే14 (అంతిమ తీర్పు -N. సాయి )
పట్టణంలోని కచేరిమిట్ట 20,27 వార్డు సచివాలయంలో గురువారం నాడు వార్డు వైసిపి నాయకులు తిరివిధి ప్రసాద్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది కి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ మన్నె మాల సుకుమార్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు వాలంటీర్ వ్యవస్థ సేవలు ఎంతో అభినందనీయమని వారి సేవలను కొనియాడారు . అలాగే కరోనా నేపథ్యంలో నెలకొన్న లాక్ డౌన్ కారణంగా ఎందరో వలస కూలీలు నిరుపేదలు పలు ఇబ్బందులకు గురయ్యారని ఈ విషయం గుర్తించిన వైసిపి నాయకులు కార్యకర్తలు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని ఆదరించి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈరోజు తిరి వీధి ప్రసాద్ వారి మిత్రబృందం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి,  మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ , పట్టణ యువత అధ్యక్షులు కిశోర్ గుప్తా, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.