సంఘం బీడీ వారి ఆధ్వర్యంలో చీరల పంపిణి ...

సంఘం బీడీ వారి ఆధ్వర్యంలో చీరల పంపిణి ........(.ఆత్మకూరు అంతిమ తీర్పు ఇన్చార్జి రహమత్ ఆలీ)..........
ఆత్మకూరు పట్టణంలోని సంఘం బీడీ తయారీ నిర్వాహకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో తమ తయారీ కేంద్రం పరిధిలోని బీడీ కార్మికులు 100 మందికి వస్త్రాల పంపిణీ చేశారు.. లాక్ డౌన్ నేపథ్యంలో మరియు రంజాన్ పండుగను పురస్కరించుకొని  పేదలకు చీరలు పంపిణీ చేసినట్టు సంఘం బీడీ తయారీ కేంద్రం నిర్వాహకులు ముజీబ్ తెలిపారు.ఈ సందర్భంగా ముజీబ్  మాట్లాడుతూ సంవత్సరాల తరబడి తమ ఫ్యాక్టరీని నమ్ముకుని బీడీ పనులు చేస్తున్న కార్మికులకు లాక్ డౌన్ కారణంగా రంజాన్ పండుగకు బట్టలు కొనలేని పరిస్థితి ఉండడంతో తమ వంతుగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు