ప్రజారంజక పాలన అందిస్తున్న సి.యం వై.యస్.జగన్ : పూనూరు.రామ మనోహర్ రెడ్డి. వింజమూరు, జూన్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన యేడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సం క్షేమ ఫలాలను అందిస్తూ ప్రజారంజక పాలనను సాగించడం అభినందనీయమని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పూనూరు.రామ మనోహర్ రెడ్డి కొనియాడారు. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరుజిల్లా చేజర్ల మండలంలోని తన స్వగ్రామమైన మడపల్లి నుండి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానంకు పూనూరు.రామ మనోహర్ రెడ్డి తన సన్నిహితులతో నిరంతర పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 15 వ తేదీ సోమవారం ఉదయం నుండి ప్రారంభించిన పాదయాత్ర మంగళవారం రాత్రికి వింజమూరుకు చేరుకుంది. వింజమూరులో వై.సి.పి నేతలు మాజీ మండలాధ్యక్షులు గణపం.బాలక్రిష్ణారెడ్డి, గణపం.క్రిష్ణకిరణ్ రెడ్డిలు, మండల మాజీ వై.సి.పి కన్వీనర్లు మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, గువ్వల.క్రిష్ణారెడ్డిలు రామ మనోహర్ రెడ్డి బృందం సభ్యులకు స్థానిక శివాలయం వద్ద ఘన స్వాగతం పలికి బంగ్లాసెంటర్ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనూరు.రామ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పాలనలో తన మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను 90 శాతం పూర్తి చేసి దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన అరుదైన ఘనతను దక్కించుకున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, మాట తప్పని-మడమ తిప్పని నేతగా ఆంధ్రప్రదేశ్ లో సుభిక్ష పరిపాలనను అందిస్తున్నారని రామ మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు మేకపాటి. గౌతం రెడ్డి ఆశీస్సులతో పాదయాత్రను ప్రారంభించగా ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి.రాజమోహన్ రెడ్డి, యం.యల్.ఏ మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి అనుయాయులు తమ పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికి తేనీటి విందును అందించడం మరుపురాని అనుభూతిగా రామ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రాత్రికి స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధిగృగంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ కార్యక్రమాలలో రామ మనోహర్ రెడ్డి సన్నిహితులు మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన మల్లు.శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన చేజర్ల.జయరామిరెడ్డి, జె.జె పేటకు చెందిన సుబ్బరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
• Valluru Prasad Kumar
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
• Valluru Prasad Kumar
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
• Valluru Prasad Kumar
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
• Valluru Prasad Kumar
నేడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn