కావలి ,జూన్ 17 (అంతిమ తీర్పు) : ప్రాణాలు అర్పించిన వీరజవానులకు నివాళులు .... బీజేపీ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆదేశానుసారం కావలి భారతీయజనతా పార్టీ కార్యాలయంలో మహిళానాయకురాలు పద్మావతీశ్రీదేవి ఆధ్వర్యంలో ముందుగా మన దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరజవానులను స్మరిస్తూ భరతమాత పాదాలకు పుష్పాంజలిఘటించి వీరజవానులకు అశ్రునివాళి అర్పించటం జరిగింది . అనంతరం మోడీగారి పాలన ఐదేళ్ళు పూర్తి చేసుకుని మళ్ళీ విజయఫధాన ముందుకెళ్తున్నందుకు భాజపా శ్రేణులంతా విజయోత్సవాలు చేశారు. ఈకార్యక్రమంలో అలహరి హేమంత్, 16వవార్డు ఇంచిర్జి గుర్రంకొండ అరుణ్ కుమార్, 36వవార్డు ఇన్చిర్జి వెంకటేశ్వర్లు, వెంకటే, రాజావీధి ఇన్చిర్జి దూబగుంట పద్మిని, 7,వ వార్డ్ ఇన్చార్జి మోళగిరి శారద, 9వ వార్డ్ ఇన్చార్జి లావణ్య,37వవార్డ్ ఇన్చార్జి రాజారామారావు పాల్గొన్నారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం